Kalvakuntla Kavitha: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? యువతి జుట్టుపట్టి ఈడ్చుతారా? - కవిత పోస్ట్
Telangana Police: శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kalvakuntla Kavitha News: తెలంగాణ పోలీసుల తీరు పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ యువతి జుట్టు పట్టి.. కింద పడేలా చేసిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల వీడియోను కల్వకుంట్ల కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇదే నా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత "ఎక్స్" లో పోస్ట్ చేశారు. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఆర్సీని కూడా కవిత ట్యాగ్ చేశారు.
The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2024
This… pic.twitter.com/p3DH812ZBS