Mumbai News : ఓ వైపు టెర్రరిస్ట్ సర్ఫరాజ్ మరో వైపు సెలబ్రిటీల ఇళ్లకు బాంబు బెదింరింపులు - ముంబైలో హై అలర్ట్ !
ఓ వైపు సర్ఫరాజ్ మెమన్ అనే టెర్రరిస్టు వచ్చారనే ప్రచారాలు..మరో వైపు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు ముంబైను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Mumbai News : దేశ ఆర్థిక రాజధాని ముంబైను సర్ఫరాజ్ అనే టెర్రరిస్టు వణికిస్తున్నాయి. పాక్ కు చెందిన ఉగ్రవాది సర్ఫరాజ్ మెమన్ ముంబైలో తిరుగుతున్నారని ఎన్ఐఏ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ముంబై పోలీసులతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలకు ఎన్ఐఏ సమాచారం అందించింది. పాక్ ఉగ్రవాద సంస్థ వద్ద సర్పరాజ్ శిక్షణ తీసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. స ఉగ్రవాది సర్ఫరాజ్ ఖాన్ కు సంబందించిన ఐడీ కార్డులను కూడా ఎన్ఐఏ పోలీసులతో పాటు వివిధ దర్యాప్తు సంస్థలకు పంపింది. సర్ఫరాజ్ ఖాన్ చైనా, పాక్ లో ప్రత్యేక శిక్షణ పొందాడని, చాలా ప్రమాదకరమని ఎన్ఐఏ పోలీసులు చెబుతున్నారు.
సర్ఫరాజ్ మెమెన్ గురించి అంతటా అప్రమత్తమైతే.. మరో వైపు ఆకతాయిలో లేకపోతే నిజంగానే కుట్ర చేశారో కానీ.. సెలబ్రిటీల ఇళ్లకు వరుసగా బాంబు బెదిరిపులు వస్తున్నాయి. బాలీవుడ్ అగ్రనటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర . ముఖేష్ అంబానీ ల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతోపాటు ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. అగ్ర నటుల నివాసం వద్ద బాంబులు పెట్టామంటూ మంగళవారం ఉదయం నాగ్‌పుర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. క్షణ్ణంగా పరిశీలించిన అనంతరం పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదని ముంబై పోలీసులు ప్రకటించారు.
అయితే బయటకు చెప్పడం లేదు కానీ.. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రతోపాటు యాంటిలియాలోని ముఖేష్ అంబానీ ఇంటికి కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు కాల్స్ చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఉగ్రవాది మెమెన్ అనుచరులు ముంబైలో సంచరిస్తున్నారనే వార్తలు నేపథ్యంలో వాణిజ్య మహానగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు.. హై అలర్ట్ ను పోలీసులు ప్రకటించారు. ఈ బెదిరింపు కాల్స్ వెనుక సర్ఫరాజ్ మెమన్ ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.. కానీ... ఆ ఉగ్రవాది ముంబైలో ఉన్నారని తేలడంతో మరింత టెన్షన్ రేపుతోంది.
ప్రస్తుతం సర్ఫరాజ్ మెమన్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాది సర్ఫరాజ్ ఖాన్ దాడులు చేసే అవకాశముందన్న హెచ్చరికతో ముంబయిలో హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సర్ఫరాజ్ మెమన్ పెను విధ్వంసం సృష్టించే అవకాశముందని ఎన్ఐఏ అధికారులు అందరినీ అలెర్ట్ చేశారు. నిజంగా సర్ఫరాజ్ మెమన్ ముంబైలో ఉన్నాడా... లేకపోతే ఇతర చోట్లకు వెళ్లారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
నియోజకవర్గానికి రూ. 50 కోట్లు - బాన్సువాడ పర్యటనలో కేసీఆర్ వరాలు !