జగన్ అరాచక పాలన వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు: పురందేశ్వరి
ఏపీకి 25 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని... ఇంటి స్థలాలు, ఇళ్లు ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.
అరాచక పాలన వల్లే ఏపీకి పెట్టుబడులు రావడంలేదు: పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు, బీజేపీ నాయకులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వైసీపీ నేతలు ధ్వజమెత్తగా, బీజేపీ నేతలు కూడా దీటుగా బదులిస్తున్నారు. అరాచక పాలన వల్లే ఏపీకి పెట్టుబడులు రావడంలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విమర్శించారు. ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ నుంచి పారిపోతున్నారని వెల్లడించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించింది ఎవరో సీఎం వైఎస్ జగన్ చెప్పాలని నిలదీశారు.
ఏపీకి 25 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని... ఇంటి స్థలాలు, ఇళ్లు ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. పేదల వద్ద డబ్బు తీసుకుని స్థలాలకు పట్టాలు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం ఇచ్చే బియ్యంపైనా జగన్ ఫొటోలు దారుణమని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలనే దిశగానే పాలన జరగాలని పురందేశ్వరి హితవు పలికారు.
విశాఖకు Nnarendra Modi ప్రభుత్వ కేటాయింపులు...
ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ (ECEC) ప్రాజెక్ట్ ఫేజ్-1లో భాగంగా విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC ) ఏర్పాటు
500 కోట్లతో 350 పడకల సూపర్ స్పెషలిటీ ఇఎస్ఐ హాస్పటల్ ఏర్పాటు
2022లో 688.73 కోట్లతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) శాశ్వత ప్రాంగణ నిర్మాణం పూర్తి
Why did Shri @AmitShah say that Vizag has become a den of anti-social elements under Jagan Mohan Reddy?
— BJP (@BJP4India) June 11, 2023
Do listen to the Union Home and Cooperation Minister, Shri Amit Shah!
Watch the full video: https://t.co/ChjM5NhUwb pic.twitter.com/DTMDed4Gm3
విశాఖపట్నం - నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ చేయలేదు. పేదల కోసం మోడీ రేషన్ ఉచితంగా బియ్యం పంపిస్తుంటే జగన్ బియ్యం మీద స్టిక్కర్ వేసుకుంటున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 5 లక్షల కోట్ల వరకు మోడీ ఇచ్చినా అభివృద్ధి జరగలేదు. ఈ సొమ్ము అంతా ఎక్కడికి పోయింది అంటే జగన్ ప్రభుత్వంలో క్యాడర్ అవినీతి జరుగుతుంది. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నందుకు వైఎస్ జగన్ సిగ్గుపడాలి - అమిత్ షా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..
బీజేపీ అధ్యక్షుడి మీద మాట్లాడే స్థాయి వైసీపీ నేతలకు లేదు. తూర్పుగోదావరి జిల్లా ఆవ భూముల్లో ఎంత అవినీతి జరిగిందో నేను కౌన్సిల్ లో మాట్లాడాను. ల్యాండ్, భూ మాఫియా ఎక్కువైపోయింది. బీర్లు వాటి బ్రాండ్లు ఏమిటి.. రాష్ట్రంలో ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఈ అంశాల మీద చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రనికి 9 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే.. ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది.. అందుకే నిధులు ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా. గ్రామాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నాం.. ఒక్కరూపాయి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్నారు.