Bengal Bjp Vs TMC : తృణమూల్‌లోకి క్యూ కడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు..! బెంగాల్‌లో ఏం జరుగుతోంది..?
బెంగాల్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరుసగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. వారంతా గతంలో తృణమూల్ నేతలే కావడంతో వారిని ఆపడం బీజేపీ నేతల వల్ల కావడం లేదు.
బెంగాల్‌లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు ఈడీ నోటీసులతో తృణమూల్‌లో అలజడి ప్రారంభమైందని బెంగాల్ భారతీయ జనతా పార్టీ అంచనా వేసుకుంటోంది. కానీ టీఎంసీ నేతలు మాత్రం సైలెంట్‌గా తమ పనిని తాము చేసుకెళ్లిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను తృణమూల్‌లోకి లాగేసుకుంటున్నారు. అందర్నీ ఒకే సారి కాకుండా వారానికొకకరిని చేర్చుకుంటూ బీజేపీకి షాకిచ్చేలా ప్లాన్లు అమలు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట తృణమూల్ కీలక నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దంపతులకు ఈడీ నోటీసులు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా తృఅణమూల్‌లో చేరిపోతున్నారు.
Also Read : కరోనా తర్వాత మొదటి సారి మోడీ అమెరికా పర్యటన
సౌమోన్ రాయ్ అనే బీజేపీ ఎమ్మెల్యే శనివారం తృణమూల్‌లో చేరిపోయారు. ఇప్పటికే ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్, విశ్వజిత్ దాస్‌లు బీజేపీని వీడి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. బెంగాల్ అభివృద్ధి కోసం పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే వీరెవరూ నిఖార్సైన బీజేపీ నేతలు కాదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ అధికారంలోకి వస్తుందనే హైప్ రావడంతో వారంతా మమతాను వదిలేసి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. వీరిని చూసి మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి చేరే అవకాశం ఉంది.
Also Read : బెంగాల్లో ఉపఎన్నికకు రంగం సిద్ధం
ఎన్నికలకు ముందు బీజేపీ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. బీజేపీ నేతలుగా ఇప్పుడు చెలామణి అవుతున్న వారంతా ఒకప్పుడు టీఎంసీ నేతలే. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో అత్యధికులు టీఎంసీ నేతలే. బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో దాదాపుగా 30 మంది తృణమూల్‌లోకి వస్తామని మమతా బెనర్జీకి విజ్ఞప్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మమతా బెనర్జీ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే.. వారంతట వారు తృణమూల్‌లోకి వచ్చేందుకు సిద్ధమవడమే ఇక్కడ అసలు రాజకీయం.అయితే తాము పార్టీలోకి వస్తామని కబురు చేస్తున్న వారందర్నీ పార్టీలో చేర్చుకోవడానికి మమతా బెనర్జీ సిద్ధంగా లేరు. పార్టీ కష్టకాలంలో వదిలి పెట్టి వెళ్లిపోయిన వారిపై ఏ మాత్రం ఆమె సానుభూతి చూపించడం లేదు. బీజేపీ బెదిరింపులకు భయపడి వెళ్లినా వ్యక్తిగత విమర్శలు చేయని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి వారినే చేర్చుకోవాలని అనుకుంటున్నారు.
Also Read : సొంత విమానం కొన్న మాజీ ప్రధాని
తాజాగా భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ ఖరారైంది. దీంతో రాజకీయం మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో అక్కడ నుంచి టీఎంసీ అభ్యర్థి యాభై వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు. అంతకు అక్కడ ఎమ్మెల్యేగా మమతా బెనర్జీనే ఉండేవారు. అయితే నందిగ్రాం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ వేరే అభ్యర్థిని నిలబెట్టారు. నందిగ్రాంలో మమతా ఓడిపోవడంతో ఎమ్మెల్యే పదవికి నందిగ్రాం నుంచి గెలిచిన తృణమూల్ నేత రాజీనామా చేశారు. ఇక నుంచి బీజేపీని బలహీనం చేసేందుకు మరింత మంది ఎమ్మెల్యేల్ని మమతా బెనర్జీ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది.
Also Read : కార్లకూ కరవు కాలమే..!