అన్వేషించండి

Devegowda Flight : సొంత విమానం కొన్న మాజీ ప్రధాని.. శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు..!

మాజీ ప్రధాని దేవేగౌడ సొంత చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేశారు. తొలి ప్రయాణానికి ముందు శ్రీవారి చెంత పూజలు చేశారు.

మాజీ ప్రధాని దేవేగౌడ ప్రత్యేక విమానానికి ఓనర్ అయ్యారు. ఇష్టపడి కొనుగోలు చేసిన చార్టెడ్ ఫ్లైట్‌ను ముందుగా శ్రీవారి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజులు చేయించేందుకు తిరుపతికి తీసుకు వచ్చారు. ప్రత్యేక పూజల కోసం ముందుగా ఆ విమానాన్ని తిరుపతికి తీసుకువచ్చారు. ఆ తర్వాత మరో ప్రత్యేక విమానంలో దేవగౌడ కుటుంబం తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అందరూ కలిసి  ఇంటర్నేషనల్ టెర్మినల్ లో ఉన్న విమానాన్ని పరిశీలించారు. ఆ తర్వతా ప్రత్యేక పూజల్లో పాల్గోన్నారు.
Devegowda Flight : సొంత విమానం కొన్న మాజీ ప్రధాని.. శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు..!దేశంలో శ్రీమంతులు  ప్రత్యేక విమానాలు కొనుగోలు చేసిన తర్వాత శ్రీవారి చెంతకు తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు చేయిస్తారు. విమానయాన సంస్థలు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతాయి. దేశంలో ఎవరు ఏ కొత్త విమానం కొన్నా ముందుగా శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు చేయాల్సిందే. ఆ సెంటిమెంట్‌నే మాజీ ప్రధాని దేవేగౌడ కూడా ఫాలో అయ్యారు. ప్రత్యేక విమానానికి శ్రీవారి చెంత తొలి పూజ చేశారు.
Devegowda Flight : సొంత విమానం కొన్న మాజీ ప్రధాని.. శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు..!దేవేగౌడ మాజీ ప్రధాని, ఆయన తన పార్టీ జనతా దళ్ సెక్యూలర్ కీలక నేతగా ఉన్నారు. ఆ పార్టీకి సుప్రీం అయినప్పటికీ.. ఆయన కుమారుడు కుమారస్వామినే పార్టీని నడిపిస్తారు. వయోభారం కారణంగా దేవేగౌడ పార్టీ కార్యక్రమాలను పరిమితంగానే పట్టించుకుంటూ ఉంటారు. అయితే పార్టీ పరమైన విధాన నిర్ణయాల్లో మాత్రం ఇప్పటికీ కీలకంగా ఉంటారు.
Devegowda Flight : సొంత విమానం కొన్న మాజీ ప్రధాని.. శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు..!దేవేగౌడ విమానాన్ని  వ్యక్తిగతంగా కొనుగోలు చేశారా లేదా పార్టీ తరపున కొనుగోలు చేశారా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలోనే పార్టీ తరపున ప్రత్యేక విమానాన్ని కోనుగోలు చేయడానికి దేవేగౌడ కుమారుడు కుమారస్వామి ఆసక్తి చూపించారు. ఎన్నికల సమయంలో ప్రయాణాలకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తోందని అందుకే పార్టీకే హెలికాఫ్టర్, విమానాలు ఉంటే ఖర్చు తగ్గుతుందని ఆయన అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. చార్టెడ్ ఫ్లైట్ ఖరీదు రూ. రెండు వందల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Devegowda Flight : సొంత విమానం కొన్న మాజీ ప్రధాని.. శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు..!
దేశంలో సొంత విమానాలు ఉన్న రాజకీయ నేతలు చాలా పరిమితంగానే ఉన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన వారికి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయేమో కానీ.. రాజకీయాల్లో ఉన్న వారికి దాదాపుగా ఉండవు. ఒక వేళ కొనుగోలు చేస్తే రాజకీయ ప్రత్యర్థులు తీవ్రమైన విమర్శలు చేస్తారు. ఆరోపణలు చేస్తారు. అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తారు. ఈ క్రమంలో దేవేగౌడ ఆ చార్టెడ్ ఫ్లైట్‌ను ఎలా కొనుగోలు చేశారన్నది కూడా కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఎలా కొనుగోలు చేశారు.. ఎంత మొత్తం పెట్టారన్నదాని సంగతిని పక్కన పెడితే..  దేశంలో ప్రత్యేక విమానం ఉన్న రాజకీయ నేతల్లో దేవే గౌడ ఒకరని ఇక చెప్పుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చంద్రబాబుకు ఇవే లాస్ట్ ఎన్నికలు? నాన్న మృతిపై నేటికీ అనుమానాలు ఉన్నాయ్?
చంద్రబాబుకు ఇవే లాస్ట్ ఎన్నికలు? నాన్న మృతిపై నేటికీ అనుమానాలు ఉన్నాయ్?
ABP Desam Top 10, 21 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 21 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Sachin Tendulkar Car Collection: సచిన్ సూప‌ర్బ్ కార్ క‌లెక్ష‌న్: క్రికెట్ గాడ్ లగ్జరీ గ్యారేజ్ లోని టాప్ కార్ల కలెక్షన్ పై ఒక లుక్
సచిన్ సూప‌ర్బ్ కార్ క‌లెక్ష‌న్: క్రికెట్ గాడ్ లగ్జరీ గ్యారేజ్ లోని టాప్ కార్ల కలెక్షన్ పై ఒక లుక్
India Vehicle Sales Record: ఇండియ‌న్ ఆటోమొబైల్ రికార్డుల జోరు: నిమిషానికి 54 వాహనాల అమ్మకాలతో దూసుకెళ్తున్న డొమెస్టిక్ మార్కెట్
ఇండియ‌న్ ఆటోమొబైల్ రికార్డుల జోరు: నిమిషానికి 54 వాహనాల అమ్మకాలతో దూసుకెళ్తున్న డొమెస్టిక్ మార్కెట్

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minimum Wages in Telangana: తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
TMC Political Crisis: చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
Tamil Nadu Chief Minister Vijay Cabinet Expansion: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
Mega 158 Movie : చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Tea Benefits in Summer : వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
Embed widget