Subramanian Swamy Comments: 'మోదీ మత్తులో మాట్లాడుతున్నారు'- BJP మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Subramanian Swamy Comments: మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయీ, ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు భాజపా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.
Subramanian Swamy Comments: కేంద్రమాజీ మంత్రి, భాజపా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని ఆరోపించారు.
We Indians conceded that Tibet and Taiwan as part of China due the foolishness of Nehru and ABV. But now China does even honour the mutually agreed LAC and grabbed parts of Ladakh while Modi is in stupor stating "koi aaya nahin". China should know we have elections to decide .
— Subramanian Swamy (@Swamy39) August 3, 2022
మాజీ ప్రధానులపై
మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయీలపై కూడా సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేశారు. నెహ్రూ, వాజ్‌పేయీ అవివేకం వల్లే ఈ రోజు టిబెట్, తైవాన్‌లు చైనాలో భాగమయ్యాయని ఆయన ఆరోపించారు. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.
కీలక సమయంలో
అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తోన్న సమయంలోనే సుబ్రహ్మణ్యస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. పెలోసీ.. తైపీలో అడుగుపెడితే చైనా సైన్యం చూస్తూ ఊరుకోదని డ్రాగన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ పెలోసీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. టిబెట్‌లో పర్యటించి అమెరికా అండగా ఉందని వారికి హామీ ఇచ్చారు.
Also Read: Vice-Presidential Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికే మాయావతి జై
Also Read: Ruchira Kamboj: ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్- మొట్టమొదటి మహిళగా రికార్డ్!