BJP Leader on Rahul Gandhi: రాహుల్ స్టైల్ అదుర్స్ అంటూ పొగిడిన బీజేపీ లీడర్, అంతలోనే సెటైర్లు
BJP Leader on Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాగాలాండ్ బీజేపీ ప్రెసిడెంట్ తెంజెన్ ఇమ్నా సెటైర్లు వేశారు.
BJP Leader on Rahul Gandhi:
బ్రిటన్ పర్యటనలో రాహుల్
రాహుల్ గాంధీ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పీచ్ కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రసంగంపైనా బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. పరాయి దేశంలో భారత్ గురించి తక్కువ చేసి మాట్లాడతారా అంటూ మండి పడింది. ఇప్పటికే దీనిపై చర్చ జరుగుతుండగా నాగాలాండ్ బీజేపీ అధ్యక్షుడు తెంజెన్ ఇమ్నా రాహుల్ గాంధీని పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. లండన్‌లో దిగిన ఫోటోను రాహుల్ గాంధీ ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఫోటోపై కామెంట్ చేసిన తెంజెన్ ఇమ్నా "నెక్స్ట్ లెవల్" అంటూ కితాబునిచ్చారు.
"ఇది కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఫోటో అదిరింది. కాన్ఫిడెన్స్, ఫోజ్ కూడా నెక్స్ట్ లెవల్ ఉన్నాయి"
- తెంజెన్ ఇమ్నా, నాగాలాండ్ బీజేపీ అధ్యక్షుడు
Stand up for what you believe in, even if it means you stand alone. pic.twitter.com/dV3fG4NfB9
— Congress (@INCIndia) March 6, 2023
కొటేషన్‌పై సెటైర్..
కాంగ్రెస్, రాహుల్ అభిమానులు కూడా ఈ ఫోటో అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పీఎం మెటీరియల్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే తెంజెన్ ఇమ్నా ఓ ట్విస్ట్ ఇచ్చారు. పొగిడినట్టే పొగిడి అంతలోనే సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ ఫోటోతో పాటు రాసిన కొటేషన్‌ను కాపీ కొట్టారంటూ మరో ట్వీట్ చేశారు. కనీసం కొటేషన్ అయినా సొంతగా రాసుకోవచ్చుగా అని సెటైర్లు వేశారు. ఆ కొటేషన్ గూగుల్‌లో దొరికిందని చెబుతూ రెండు ఫోటోలను పక్క పక్కన పెట్టి షేర్ చేశారు. ఈ రెండు పోస్ట్లూ వైరల్ అవుతున్నాయి.
कम से कम Caption तो खुद लिखा करो 🙄 pic.twitter.com/YvHUyfKGZF
— Temjen Imna Along (@AlongImna) March 8, 2023
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇచ్చిన రాహుల్ మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. ప్రధాని మోదీ పాలనలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలందరిపైనా గుట్టుగా నిఘా పెడుతున్నారంటూ పెగాసస్ కేసుని ప్రస్తావించారు. దేశం అన్వయించుకోడానికి వీల్లేని విధానాలు బలవంతంగా రుద్దుతున్నారంటూ మండి పడ్డారు. పెగాసస్ గురించి చెబుతూ తన ఫోన్లోనూ పెగాసస్ వైరస్ ఉందని, ఇదే విషయం అధికారులు చెప్పారని అన్నారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నిన్నటి ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో రాహుల్ గాంధీకి ముందే తెలుసు. కాంగ్రెస్‌ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పెగాసస్ ఆయన ఫోన్లో కాదు. ఆయన మెదడులోనే ఉంది. బహుశా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఏం చెప్పిందో రాహుల్ విన్నట్టు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రధాని మోదీని గౌరవిస్తున్నారని చెప్పారు. తన మొబైల్లో పెగాసస్ ఉందన్న అనుమానం ఉన్నప్పుడు అది ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు. విదేశాల్లోనే ఉన్న స్నేహితులతో చేతులు కలిపి దేశ పరువుని దిగజార్చేలా మాట్లాడుతున్నారు"
అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించీ ప్రస్తావించారు అనురాగ్ ఠాకూర్. ప్రజలందరూ ప్రధాని మోదీని అభిమానిస్తున్నారని, అందుకే బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందని తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ సొంతమని అన్నారు. భారత మీడియాను కూడా రాహుల్ గాంధీ కించపరుస్తున్నారని మండి పడ్డారు. పెగాసస్ స్పైవేర్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అది పెగాసస్ మాల్వేర్ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చాలా స్పష్టంగా చెప్పింది. టెక్నికల్ టీమ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.