ABP C Voter Survey : హోరాహోరీ ఉన్నా బీజేపీకే అడ్వాంటేజ్ ..ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో వెల్లడి !
ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే నిర్వహించింది. అన్ని రాష్ట్రాల్లోనూ హోరాహోరీ పోరాటం ఉన్నప్పటికీ బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నట్లుగా తెలింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశంలోనే ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. అక్కడ వచ్చే ఫలితాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. అందుకే అందరి దృష్టి యూపీపై ఉంది. అక్కడ ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ అది అధికారం చేజారిపోయేంత స్థితిలో లేదని ఏబీపీ- సీఓటర్ సర్వేలో తేలింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ బీజేపీకి క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. యూపీ అతి పెద్ద రాష్ట్రం. అయినప్పటికీ అన్ని రీజియన్లలోనూ బీజేపీనే ముందడుగు వేస్తోంది. కొన్ని చోట్ల సమాజ్ వాదీ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. అయినా బీజేపీనే పైచేయి సాదించబోతోందని తేలింది.
యూపీలో బీజేపీకి సాధారణ మెజార్టీ - అఖిలేష్ గట్టిపోటీ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 212 - 224 సీట్ల మధ్య లభించే అవకాశం ఉంది. యూపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 403. 40శాతం ఓట్లు బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ కారణంగా బీజేపీకి సాధారణ మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. గట్టి పోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీ 151 నుంచి 163 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఆ పార్టీ మిత్రపక్షాలతో కలిసి 34 శాతం ఓట్లను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక గతంలో అధికారం చేపట్టిన బహుజన సమాజ్ పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదని తేలింది. ఆ పార్టీకి కేవలం 13 శాతం ఓట్లు 12 నుంచి 24 మాత్రమే అసెంబ్లీ సీట్లు వస్తాయని ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో తేలింది. ఇక ప్రియాంకా గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్ా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడటం లేదు. 2 నుంచి పది అసెంబ్లీ సీట్లు మాత్రమే ఆ పార్టీకి లభించే అవకాశాలు ఉన్నాయి. ఏడు శాతం ఓట్లు సాధించనుంది.
Also Read : వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్‌ల కంటే వేగంగా కొత్త వైరస్!
పంజాబ్‌లో హంగ్ - సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆమ్ ఆద్మీ !
పంజాబ్ రాజకీయాల్లో ఈ సారి సమూలమైన మార్పులు రాబోతున్నాయి. రైతు ఉద్యమం.. ఇతర సమస్యలు.. బీజేపీ - అకాలీదళ్ విడిపోవడం వంటి కారణాలతో పాటు .. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ సారి అధికారం ఎవరికి దఖలు పడుతుందన్నది స్పష్టత లేకుండా పోయింది. హంగ్ అసెంబ్లీ ఖాయమని ఏబీపీ- సీఓటర్ తాజా అంచనాల్లో వెల్లడయింది. ర్యాండమ్‌గా 18వేల శాంపిల్స్ తీసుకుని చేసిన సర్వే అంచనాల ప్రకారం ఆప్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడనుంది.
మొత్తం పంజాబ్ శాసనసభలో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 38.4శాతం ఓట్లతో ఆమ్ ఆద్మీ 50 నుంచి 56 స్థానాలు గెల్చుకునే అవకాశాలు ఉన్నాయి. రెండో స్థానంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 34.4 శాతం ఓట్లతో 39 నుంచి 45 స్థానాలు మాత్రమే సాధించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 77 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంది. శిరోమణి అకాలీదళ్ బీజేపీ నుంచి విడిపోయి పోటీ చేస్తోంది. ఈ కారణంగా సీట్లు, ఓట్లను కాస్తంత పెంచుకునే అవకాశం ఉంది. ఆ పార్టీ 20.4 శాతం ఓట్లతో 17 నుంతి 23 ఎమ్మెల్యే సీట్లు సాధించే అవకాశం ఉంది. బీజేపీ ఓట్ల శాతం 2.6 శాతానికి పరిమితమవుతుంది. మూడు లోపు అసెంబ్లీ సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెట్టిన అమరీందర్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకు రారని తేలింది. మొత్తంగా చూస్తే శిరోమణి అకాలీదళ్ కింగ్ మేకర్‌గా అవతరిస్తుందని ఏపీబీ - సీ ఓటవర్ సర్వేలో తేలింది.
Also Read : కోవిషీల్డ్ మూడో డోస్‌కు నో.. "సీరం"కు పర్మిషన్ ఇవ్వని కేంద్రం !
ఉత్తరాఖండ్‌లో హోరాహోరీ.. అడ్వాంటేజ్ బీజేపీకే !
ఉత్తరాఖండ్‌లో తీవ్ర అధికార వ్యతిరేకత ఉంది. ఈ కారణంగానే అక్కడ మూడో సీఎం వచ్చారు. అందుకే బీజేపీ అక్కడ ఎదురీదుతోంది. అయితే కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ .. కాస్తంత అడ్వాంటేజ్ బీజేపీకే ఉన్నట్లుగా ఏబీపీ-సీఓటర్ సర్వేలోతేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 39.8 శాతం ఓట్లతో 33 నుంచి 39 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో ఆ మాత్రం సీట్లు వస్తే సాధారణ మెజార్టీ వచ్చినట్లే. కాంగ్రెస్ పార్టీ 35.7శాతం ఓట్లతో 29 నుంచి 35 స్థానాలు గెల్చుకునే అవకాశం ఉంది. అటే కాస్తంత అడ్వాంటేజ్ బీజేపీకే ఉంది. ఉత్తరాఖండ్‌లోనూ ఆప్‌కు ఒకటి నుంచి మూడు అసెంబ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Night Curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూలు .. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు !
గోవాలో మళ్లీ బీజేపీదే అధికారం !
చిన్న రాష్ట్రమైనా అత్యంత కీలకమైన రాష్ట్రం అయిన గోవాలో భారతీయ జనతా పార్టీకే ఎడ్జ్ కనిపిస్తోందని ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో వెల్లడయింది. 30 శాతం ఓట్ల షేర్ సాధించి 17 నుంచి 21 స్థానాలు బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంచి పనితీరు కనబర్చడంతో ప్రజలు ఆయవ వైపు సానుకూలంగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోతుందని తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ప్రతిపక్ష స్థానానికి చేరే చాన్స్ ఉంది. ఆ పార్టీకి ఐదు నుంచి 9 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: PM Modi: సైనికుడు మిలటరీలో ఉన్నంతవరకే కాదు.. జీవితాంతం యోధుడే
మణిపూర్‌లోనూ హోరాహోరీ.. బీజేపీకే అడ్వాంటేజ్ !
ఇక ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ బీజేపీ ముందంజలో ఉన్నట్లుగా సర్వేలో తేలింది. మొత్తం 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 29 నుంచి 33 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి 23 నుంచి 27 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సర్వేలో తేలింది. ఎన్‌పీఎంకు రెండు నుంచి ఆరు సీట్లు.. ఇతరులకు రెండు లోపు సీట్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read : బతికున్న వాళ్లకు వేయండయ్యా వ్యాక్సిన్.. చనిపోయిన వాళ్లకెందుకు.. పైగా సర్టిఫికెట్ కూడానూ?