The Kerala Story: కేరళ స్టోరీ సినిమా చాలా బాగుంది, అందరూ చూడండి - జేపీ నడ్డా రివ్యూ
The Kerala Story: కేరళ స్టోరీ సినిమా చూసిన జేపీ నడ్డా చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు.
The Kerala Story:
బెంగళూరులో చూసిన నడ్డా
దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతున్న The Kerala Story సినిమాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగళూరులోని థియేటర్‌లో చూశారు. రివ్యూ కూడా ఇచ్చారు. విషపూరితమైన ఉగ్రవాదంలో మరో కోణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రశంసించారు. ఇప్పటి వరకూ ఆయుధాలు, బాంబులతో కూడిన ఉగ్రవాదాన్నే చూశామని...ఈ సినిమా మరో కోణంలో టెర్రరిజాన్ని పరిచయం చేసిందని కితాబునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఏ రాష్ట్రానికో, మతానికో ఆపాదించాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. సొసైటీకి ఈ సినిమా ఓ హెచ్చరిక అని స్పష్టం చేశారు.
"తుపాకుల మోతలు, బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు..ఇలా ఎన్నో ఉగ్రచర్యల్ని చూశాం. కానీ అంత కన్నా ప్రమాదకరమైన, విషపూరితమైన ఉగ్రవాదాన్ని ఈ సినిమాలో చూపించారు. బాంబులు, ఆయుధాలు లేని ఉగ్రవాదాన్ని కళ్లకు కట్టారు. ఉగ్రవాదులు సమాజంపై ఎంత విషం చిమ్ముతున్నారో వివరించారు. ఈ ఉగ్రవాదాన్ని ఏ ఒక్క రాష్ట్రానికో, మతానికో పరిమితం చేయలేం. యువత వాళ్ల వలలో పడి ఎలా దారి తప్పుతోందో ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. అలా దారి తప్పకూడదని హెచ్చరించడమే ఈ సినిమా ఉద్దేశం. ఇది సినిమానే కావచ్చు. కానీ ఉగ్రవాదానికి సంబంధించి ఎన్నో విషయాలు ఇందులో ప్రస్తావించారు. ఉగ్ర మూకల్లో కలిసిపోతున్న మన యువత ఎలా వలలో చిక్కుతోందో చూపించారు. ఈ సినిమా అందరూ చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను"
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
ये फिल्म (The Kerala Story) देख कर हमारी जनता समझ पाएगी कि किस तरीके की साजिश हमारे समाज को खोखला करने के लिए, समाज को कमजोर करने के लिए रची जा रही है और हमें इस से आगाह होना चाहिए।
— BJP (@BJP4India) May 7, 2023
- श्री @JPNadda
पूरा देखेंः https://t.co/d7Zh1A6tfY pic.twitter.com/hQ86fnzc6m
విమర్శలు..
అయితే...ఈ సినిమాని బీజేపీ ఓన్ చేసుకుంటోందని, కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శిస్తున్నాయి మిగతా పార్టీలు. ముఖ్యంగా కేరళలో దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పలు చోట్ల సినిమా ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారు. ముస్లిం సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్...ఈ సినిమా తప్పుదోవ పట్టించే విధంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. అంత మంది మతం మారినట్టు లెక్కలు లేవని తేల్చి చెప్పారు. మత సామరస్యంపై విషం చిమ్ముతున్నారని మండి పడ్డారు. తమిళనాడులోనూ ఇదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీ కావాలనే ఇలాంటి సినిమాలకు సపోర్ట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాపై ట్యాక్స్‌ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఓ వీడియో విడుదల చేసి ఈ విషయం వెల్లడించారు. బీజేపీ సహా మరి కొన్ని హిందూ సంస్థలు కేరళ స్టోరీ సినిమాపై పన్ను వసూలు చేయొద్దని డిమాండ్ చేశాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చౌహాన్...వెంటనే ఈ ప్రకటన చేశారు.
Also Read: Apple Layoffs: యాపిల్ కంపెనీలోనూ లేఆఫ్‌లు? క్లారిటీ ఇచ్చిన సీఈవో టిమ్‌కుక్