Bihar News: 'సాయి బాబా సీరియల్ చూశాను- తర్వాత ఓ అద్భుతం జరిగింది'
Bihar News: సాయి బాబా సీరియల్ చూడటం వల్ల తన జీవితంలో ఓ అద్భుతం జరిగిందని బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ అన్నారు.
![Bihar News: 'సాయి బాబా సీరియల్ చూశాను- తర్వాత ఓ అద్భుతం జరిగింది' Bihar News Tej Pratap Yadav watching Sai Baba's serial on TV miracle happened house know matter Bihar News: 'సాయి బాబా సీరియల్ చూశాను- తర్వాత ఓ అద్భుతం జరిగింది'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/13/336e852eb68ff023f2664d585f7e62e81665645948848218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bihar News: ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బిహార్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న తేజ్ ప్రతాప్.. సాయి బాబా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శిరిడీ సాయి బాబా తన జీవితంలో అద్భుతం చేశారని తేజ్ ప్రతాప్ అన్నారు.
సీరియల్ చూస్తూ
టీవీలో ప్రసారమవుతోన్న సాయి బాబా సీరియల్ ఇటీవల తాను చూశానని తేజ్ ప్రతాప్ అన్నారు. సీరియల్ చూస్తూ సాయి బాబా ఆశీర్వాదం తనకు దక్కాలని కోరుకున్నానని తెలిపారు. ఆ తర్వాత బుధవారం ఓ అద్భుతం జరిగిందని తేజ్ ప్రతాప్ అన్నారు.
बिहार के मंत्री तेज प्रताप यादव का दावा... शिरडी के साईं बाबा को याद किया और सोचा उनका भभूत मिल जाए. घर पर अपने ऑफिस में गया तो टेबल पर मिला भभूत का पैकेट. @TejYadav14
— Shubham (@Shubhamsc_) October 13, 2022
Video- @iajeetkumar pic.twitter.com/Ke7vrsbQjv
సర్వ రోగ నివారిణి
తాను శిరిడీ సాయి ట్రస్ట్‌లో సభ్యుడినని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ట్రస్ట్ సభ్యుడని ఆయన అన్నారు. శిరిడీ సాయి బాబా విభూతితో ప్రతి వ్యాధి నయమవుతుందని తేజ్ ప్రతాప్ అన్నారు. అందుకే తాను కూడా ఈ భస్మం ధరిస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే బాబా.. తన టేబుల్‌పై రెండు విభూతి ప్యాకెట్లు పెట్టారని తేజ్ ప్రతాప్ అన్నారు. సాయి బాబా తన జీవితంలో అద్భుతం చేశారని తేజ్ ప్రతాప్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజ్ ప్రతాప్ తరుచూ ఏదో ఒక వ్యవహారంలో వార్తల్లో నిలుస్తుంటారు.
Also Read: India Pak At UNGA: ఐరాసలో అడిగి మరీ తిట్టించుకున్న పాకిస్థాన్- భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)