By: Ram Manohar | Updated at : 19 Oct 2022 03:22 PM (IST)
బిహార్‌లో ఏడో తరగతి క్వశ్ఛన్ పేపర్‌లో అడిగిన ఓ ప్రశ్న వివాదాస్పదమవుతోంది. (Image Credits: ANI)
Kashmir as Separate Country:
బిహార్‌లో..
బిహార్‌లోని కిషన్‌గంజ్ ప్రాంతంలో ఓ స్కూల్‌లో ఏడో తరగతి ప్రశ్నాపత్రంలో అడిగిన ఓ క్వశ్చన్ వివాదాస్పదమైంది. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పరిగణిస్తూ ప్రశ్న అడగటంపై అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై స్కూల్ హెడ్‌మాస్టర్ స్పందించి "అనుకోకుండా జరిగిన తప్పు" అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. "బిహార్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి నేరుగా మాకు ఈ ప్రశ్నాపత్రాలు వచ్చాయి. "కశ్మీర్‌లో నివసించే వారిని ఏమని
పిలుస్తారు..? అన్న ప్రశ్నకు బదులుగా కశ్మీర్ దేశ ప్రజల్ని ఏమని పిలుస్తారు..? అని తప్పుగా ప్రింట్ అయింది. ఇది మానవ తప్పిదం" అని హెడ్‌మాస్టర్ ఎస్‌కే దాస్ వెల్లడించారు. "What are people of the following countries called?" అనే మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్‌కి..."The people of Kashmir are called the..."అనే ఆప్షన్ కూడా కనిపించింది. దీనిపై భాజపా తీవ్రంగా మండి పడుతోంది. బిహార్ భాజపా అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. "నితీశ్ ప్రభుత్వం కశ్మీర్‌ని భారత్‌లో భాగమని అంగీకరించటం లేదంటే...పీఎఫ్‌ఐతో వారికి సన్నిహిత సంబంధాలున్నాయని అర్థమవుతోంది" అని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kishanganj, Bihar | Class 7 question paper terms Kashmir as separate country
Got this via Bihar Education Board. Ques had to ask what are people from Kashmir called? Mistakenly carried as what are people of country of Kashmir called? This was human error: Headteacher, SK Das pic.twitter.com/VVv1qAZ2sz — ANI (@ANI) October 19, 2022
తమిళనాడులోనూ..
అంతకు ముందు తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో ఓ క్వశ్చన్ పేపర్ వివాదాస్పదమైంది. అందులో క్యాస్ట్‌కి సంబంధించిన ప్రశ్న అడగటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎమ్‌ఏ హిస్టరీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగారు. "తమిళనాడులో ఎక్కువగా కనిపించే లోయర్ క్యాస్ట్ ఏంటి" అనే క్వశ్చన్ అందులో ఉంది. పైగా ఇదో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ కావటం వల్ల నాలుగు ఆప్షన్స్‌లో నాలుగు క్యాస్ట్‌ల పేర్లు ముద్రించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జగన్నాథన్...ఈ వివాదంపై స్పందించారు. ఇది ఎవరు చేశారో తప్పకుండా విచారణ జరుపుతామని వెల్లడించారు. హిస్టరీ మాస్టర్స్‌లో సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్‌లో ఈ క్వశ్చన్ అడిగారు. తమిళనాడు స్వాతంత్య్రోద్యమం( 1800-1947) అనే సబ్జెక్ట్‌లో ఈ ప్రశ్న వచ్చినట్టు వీసీ తెలిపారు. ఇది తాము తయారు చేసిన క్వశ్చన్ పేపర్ కాదని, వేరే యూనివర్సిటీ రూపొందిం చిందని చెప్పారు. ముందే ఈ విషయం దృష్టికి వచ్చుంటే ఈ తప్పిదం జరగకుండా చూసే వాడినని అన్నారు. "ఈ క్వశ్చన్ పేపర్ మేము తయారు చేయలేదు. ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యే అవకాశముందని, ముందుగా మేం ఆ పేపర్‌ను చదవం. ఈ వివాదాస్పద ప్రశ్నకు సంబంధించిన నాకెలాంటి సమాచారం అందలేదు. విచారణ జరిపి తీరుతాం" అని వీసీ జగన్నాథన్ స్పష్టం చేశారు.
Also Read: బీజేపీ గెలిస్తే 3000 పెన్షన్ ఇస్తారా? గుజరాత్, కర్ణాటకలో లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Weather Latest Update: తీరం దాటిన వాయుగుండం, ఈ జిల్లాలకు వర్ష సూచన! తెలంగాణలో మళ్లీ చలి
ABP Desam Top 10, 2 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Petrol-Diesel Price 02 February 2023: పెరిగిన పెట్రోల్ రేట్లతో బండి తీయాలంటే భయమేస్తోంది, ఇవాళ్టి ధర ఇది
Gold-Silver Price 02 February 2023: ఒక్కసారిగా పెరిగిన పసిడి రేటు, వెండి కూడా వేడెక్కింది
Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?