Bihar News: అడ్మిట్ కార్డులపై ధోని, ప్రధాని మోదీ ఫొటోలు!
Bihar News: ఓ యూనివర్సిటీలో డిగ్రీ విద్యార్థుల అడ్మిట్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ, ధోని ఫొటోలు వచ్చాయి.
Bihar News: బిహార్‌కు చెందిన ఓ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ పరీక్షల అడ్మిట్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫొటోలు ముద్రించడం కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూనివర్సిటీ దర్యాప్తునకు ఆదేశించింది.
ఇదీ జరిగింది
బిహార్‌లోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షల కోసం ఇటీవల అడ్మిట్ కార్డులు జారీ చేశారు. అందులో కొన్ని అడ్మిట్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, బిహార్ గవర్నర్ ఫగూ చౌహాన్ ఫొటోలు ఉన్నాయి. అనంతరం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కఠిన చర్యలు
మధుబనీ, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల పరిధిలోని కాలేజీలకు చెందిన బీఏ మూడో ఏడాది విద్యార్థులకు ఈ అడ్మిట్ కార్డులు వచ్చాయి. అనంతరం ఈ విషయం యూనివర్సిటీ దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. ఆ ఫొటోలను విద్యార్థులే అప్‌లోడ్ చేసినట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు కారణమైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యేలా ఫిర్యాదు చేస్తామన్నారు.
Also Read: Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్ కీలక ప్రకటన!
Also Read: Queen Elizabeth Funeral: రాణిని చివరిసారి చూసేందుకు కూడా మేఘన్‌కు నో పర్మిషన్!