CBI Raids RJD Leaders: బలపరీక్షకు ముందు ఆర్‌జేడీకి షాక్, నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు
CBI Raids RJD Leaders: బిహార్‌లో పలువురు RJD నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.
![CBI Raids RJD Leaders: బలపరీక్షకు ముందు ఆర్‌జేడీకి షాక్, నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు Bihar CBI raids RJD leaders In Land for Jobs Case On Day of Nitish Govt’s floor Test CBI Raids RJD Leaders: బలపరీక్షకు ముందు ఆర్‌జేడీకి షాక్, నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/24/13a94db7daccee4e9ffe6e9c7d15d96b1661319335775517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CBI Raids RJD Leaders:
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో భాగంగా..
భాజపాయేతర రాష్ట్రాల్లో సీబీఐ దాడులు, సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న పశ్చిమబెంగాల్, తరవాత ఢిల్లీ. ప్రస్తుతం బిహార్. ఫ్లోర్ టెస్ట్‌కు సిద్ధమవుతున్న ఆర్‌జేడీ, జేడీయూలకు షాక్ ఇచ్చింది CBI.పాట్నా, మధుబని ప్రాంతాల్లోని ఆర్‌జేడీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. "Land For Jobs"స్కామ్ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం జరిగింది. ఆర్‌జేడీ ట్రెజరర్, ఎమ్‌ఎల్‌సీ సునీల్ సింగ్ ఇంట్లో ఇప్పటికే సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు ఇద్దరు RJD రాజ్యసభ ఎంపీలు ఫయాజ్ అహ్మద్, అశ్ఫాక్ కరీమ్ ఇళ్లలోనూ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఆర్‌జేడీ మాజీ ఎమ్‌ఎల్‌సీ సుబోధ్ రాయ్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. అయితే...వారి పూర్తి వివరాలు మాత్రం సీబీఐ వెల్లడించలేదు. అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునే ముందే CBI ఇలా సోదాలు చేయటం సంచలనమవుతోంది.
Bihar | Raids by a Central Agency are underway at the residence of RJD MLC Sunil Singh, in Patna. More details awaited pic.twitter.com/TyQsy9khaL
— ANI (@ANI) August 24, 2022
CBI raids are underway in Bihar, in connection with the alleged land for job scam. pic.twitter.com/JnGZOcSG7N
— ANI (@ANI) August 24, 2022
గతేడాది సెప్టెంబర్ నుంచి విచారణ..
గత నెల సీబీఐ భోళా యాదవ్‌ను అరెస్ట్ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భోళా యాదవ్ OSDగా వ్యవహరించారు. ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు లాలూ కుటుంబ సభ్యులు కొందరి దగ్గర నుంచి భూములను తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మేలో ఈ కేసులో భాగంగానే లాలూతో పాటు ఆయన కుటుంబంపైనా అవినీతి కేసు నమోదు చేసింది.
లూలూ ప్రసాద్ యాదవ్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యలు ఇళ్లలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. లాలూ కూతురు మీసా భారతి ఇల్లు సహా మొత్తం 17 చోట్లు సోదాలు కొనసాగాయి. దాదాపు 12 మంది లాలూ ఇలా అక్రమంగా గ్రూప్ D ఉద్యోగాలు పొందారని అంటోంది CBI.ఈ ఉద్యోగాలు ఇచ్చినందుకు లాలూ యాదవ్ బిహార్‌లో మొత్తం 7 ప్లాట్లు లంచంగా తీసుకున్నారని, ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మంది
కుటుంబ సభ్యుల పేరుమీద ఈ ప్లాట్‌లున్నాయని చెబుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, కూతుళ్లు మీసా భారతి, హేమా యాదవ్‌తో పాటు మొత్తం 16 మంది పేర్లను FIRలో చేర్చింది CBI. గతేడాది సెప్టెంబర్‌లో ప్రాథమిక విచారణకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. లాలూ...IRCTC హోటల్స్ విషయంలో ఓ కంపెనీకి ఫేవర్‌గా పని చేశారని CBI తెలిపింది.
Also Read: Telangana Politics :ఐటీ దాడులు - లిక్కర్ స్కాం ఆరోపణలు ! బీజేపీ పక్కాగా రౌండప్ చేస్తోందా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)