Viral Video: పిల్ల మొసలిని క్షణాల్లో మింగేసిన పెద్ద మొసలి - వైరల్ వీడియో
Viral Video: చిన్న మొసలిని పెద్ద మొసలి మింగేసిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
చిన్న మొసలిని మింగేసింది..
వైల్డ్‌లైఫ్ వీడియోలంటే అందరికీ ఇష్టమే. పులి వేటాడటం, కోతులు చెట్లెక్కి అల్లరి చేయడం, ఏనుగులు గుంపులు గుంపులుగా పరిగెత్తడం... ఇలా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే...ఈ సారి మాత్రం ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా మొసళ్లు..పక్షులు, కప్పలు, చేపల్ని ఆహారంగాతీసుకుంటాయి. కానీ...తినేందుకు ఏమీ దొరకనప్పుడు చిన్న మొసళ్లను మింగేస్తాయి. ఇది ఎప్పుడూ వినడమే కానీ చూసింది లేదు. కానీ...ఓ పెద్ద మొసలి చిన్న మొసలిని మింగేస్తున్నవీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ఆకలి తీర్చుకునేందుకు చిన్న మొసలిని ఆరగించింది పెద్ద మొసలి. చిన్న మొసళ్లను తినటం పెద్ద మొసళ్లకు చాలా సులువు. గట్టిగా పళ్లతో పట్టేసుకుని ఎటూ కదలకుండా చేసేసి మెల్లగా మింగేస్తాయి. కానీ...ఇలాంటి వీడియోలు కనిపించటం చాలా అరుదు. ఇప్పుడు ఈ రేర్ వీడియోని చూసి అందరూ షాక్ అవుతున్నారు. మొసలిని మొసలే తినేయడమేంటో అని ఆశ్చర్యపోతున్నారు. సౌతాఫ్రికాలోని కర్గర్ నేషనల్ పార్క్‌లో తీసిన ఈ వీడియోకి కోట్లాది వ్యూస్ వచ్చాయి. గతేడాది పోస్ట్ చేసినప్పటికీ..ఇప్పుడు మరోసారివైరల్ అవుతోంది.
మొసలి కడుపులో పిల్లాడున్నాడని..
ఇటీవల మొసలికి సంబంధించిన ఓ వార్త అందరినీ షాక్‌కి గురి చేసింది. మొసలి ఓ పిల్లాడిని మింగేసిందన్న కోపంతో మొసలిని 7 గంటల పాటు బంధించారు గ్రామస్థులు. మధ్యప్రదేశ్‌లోని రఘునాథ్‌పూర్ గ్రామ ప్రజలు చేసిన ఈ పనికి అటవీ అధికారులు షాక్ అయ్యారు. మొసలి కాళ్లను కట్టేసి, నోరు మూసివేసే వీల్లేకుండా అలాగే 7 గంటల పాటు ఉంచారు. మొసలి కడుపులో ఉన్న బాలుడు బయటకి వస్తాడన్న నమ్మకంతో, అన్ని గంటల పాటు మొసలి నోరు మూయకుండా కట్టడి చేశారు . చంబల్ నదిలోకి స్నానం చేసేందుకు బాలుడు దిగాడని, ఆ సమయంలో మొసలి మింగేసిందని గ్రామస్థులు వాదించారు.
మరో విచిత్రం ఏంటంటే మొసలి కడుపులో ఆ బాలుడు బతికే ఉన్నాడని ఫిక్స్ అయ్యారు అంతా. ఆ బాలుడి పేరు పిలుస్తూ, బదులు కోసం ఎదురు చూశారట. అప్పటికే అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు గ్రామస్థలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. "మీరు అనుకున్నది సాధ్యం కాదు" అని వివరించారు."నదీ తీరంలో బాలుడు స్నానం చేస్తున్నాడు. ఉన్నట్టుండి మొసలి దాడి చేసింది. మొసలికి చిక్కకుండా ఉండేందుకు చాలా వేగంగా ఈదాడు . అయినా మొసలి బాలుడిని పట్టుకుంది. ఆ సమయంలో పిల్లాడు గట్టిగా అరిచాడు . వెంటనే మేమంతా ఇక్కడికి వచ్చాం" అని వివరించారు స్థానికులు. వలల సాయంతో మొసలిని పట్టుకున్నారు. గ్రామస్థులకు నచ్చచెప్పి మొసలిని నీళ్లలో వదిలే సరికి, అధికారుల తలప్రాణం తోకకు వచ్చింది. అయితే మరుసటి రోజు ఆ బాలుడి మృతదేహం నదిలో కనిపించింది.
Also Read: Gujarat Election 2022: మోడీ అనే పేరొక్కటి చాలు కదా, ఊరికే ప్రచారం చేసుకోడం ఎందుకో - గహ్లోట్ కౌంటర్