అన్వేషించండి

Bharat Taxi: ఓలా, ఉబెర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్ టాక్సీ - ఇది ఎలా పని చేస్తుందో తెలుసా?

Bharat Taxi: కేంద్రం ఓలా, ఉబెర్‌లకు ప్రత్యామ్నాయంగా భారత్ టాక్సీ తీసుకువస్తోంది. ఈ యాప్ ఎలా పని చేస్తుందన్నదానిపై ఫుల్ డీటైల్స్ ఇవీ.

Bharat Taxi cooperative model app: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న  భారత్ టాక్సీ సహకార నమూనాలో నడుస్తుంది.   ప్రైవేట్ క్యాబ్ దిగ్గజాలు ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీనిస్తూ.. డ్రైవర్ల సంక్షేమమే పరమావధిగా ఈ సరికొత్త వ్యవస్థ పని చేయనుంది.  

 భారత్ టాక్సీ: డ్రైవర్లే యజమానులు - లాభమే లక్ష్యం కాదు! 
 అమూల్ సంస్థలో పాడి రైతులు ఎలాగైతే వాటాదారులుగా ఉండి లాభాలను పంచుకుంటారో  'భారత్ టాక్సీ'లో క్యాబ్ డ్రైవర్లు కూడా కేవలం పని చేసే వారు మాత్రమే కాదు, ఆ సంస్థలో  వాటాదారులుగా ఉంటారు. 'సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్' ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాట్‌ఫారమ్, లాభాపేక్ష లేని ప్రైవేట్ సంస్థగా కాకుండా, వేలాది మంది డ్రైవర్లు కలిసి నడిపే ఒక సహకార సంఘంగా పని చేస్తుంది. వీరికి 'సారథులు' అని పేరు పెట్టారు.                                

 2. జీరో కమిషన్ - డ్రైవర్లకు పూర్తి ఆదాయం 
ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థలు ఒక్కో రైడ్‌పై డ్రైవర్ల నుండి 20% నుండి 30% వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. కానీ, భారత్ టాక్సీ  జీరో కమిషన్ మోడల్‌ను అనుసరిస్తుంది. అంటే, ప్రయాణీకుడు చెల్లించే మొత్తం  నేరుగా డ్రైవర్‌కే చెందుతుంది. ఈ వ్యవస్థ నడవడానికి డ్రైవర్లు కేవలం స్వల్ప మొత్తంలో నెలవారీ లేదా రోజువారీ మెంబర్‌షిప్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.                         

 3. వినియోగదారులకు  సర్జ్ ప్రైసింగ్ భయం లేదు 
కస్టమర్లకు ఈ భారత్ టాక్సీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం నో సర్జ్ ప్రైసింగ్ . సాధారణంగా వర్షం పడినప్పుడు లేదా రద్దీ సమయాల్లో ప్రైవేట్ యాప్‌లు ధరలను రెట్టింపు చేస్తాయి. కానీ భారత్ టాక్సీలో ధరలు పారదర్శకంగా, ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం స్థిరంగా ఉంటాయి. దీనివల్ల సామాన్య ప్రయాణీకులపై అదనపు భారం పడదు.

 4.  డిజిటల్ అనుసంధానం 
ఈ ప్రాజెక్టు వెనుక అమూల్, ఇఫ్కో (IFFCO), నాబార్డ్ (NABARD) వంటి దిగ్గజ సహకార సంస్థల మద్దతు ఉంది. ఇది ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' విజన్‌కు అనుగుణంగా డిజిలాకర్, ఉమాంగ్ (UMANG) వంటి ప్రభుత్వ యాప్‌లతో అనుసంధానించి ఉంటుంది.  ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ సేవలు జనవరి 1, 2026 నుండి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది డ్రైవర్లను చేర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.                       

ప్రయాణీకుల భద్రత కోసం ఈ యాప్‌లో రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్, డ్రైవర్ల వెరిఫికేషన్ మరియు స్థానిక పోలీసులతో అనుసంధానం వంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ద్వారా సామాన్యులు కూడా ఈజీగా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.     

టాప్ హెడ్ లైన్స్

రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
Bumrah, Pant Reentry Twist: కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
AIADMK MLAs Case: ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget