News
News
X

Bharat Jodo Yatra: క్లారిటీగా ఉన్నానంటూ వెయిటింగ్‌లో పెట్టిన రాహుల్ గాంధీ!

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర సహా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర చేస్తోన్న రాహుల్ గాంధీ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఎవ‌రు ఉంటార‌ని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాహుల్ ఇలా సమాధానమిచ్చారు.

" నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఎన్నికలు జరిగితే నా నిర్ణయం స్పష్టమవుతుంది. నేను అధ్యక్ష పదవిని చేపట్టేది, లేనిది స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూడాలి. ఈ విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నాను.                                                     "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అందుకే యాత్ర

ప్రజలతో మమేకమవడానికి భారత్ జోడో యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. భాజపా- ఆర్‌ఎస్‌ఎస్ వల్ల దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చడమే ఈ యాత్ర లక్ష్యమన్నారు.

" ప్రజలతో మమేకమవడం కోసమే భారత్ జోడో యాత్ర సాగుతోంది. భాజపా-ఆర్‌ఎస్ఎస్ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నాం. దేశంలోని అన్ని వ్యవస్థలు ఇప్పుడు భాజపా నియంత్రణలో ఉన్నాయి. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యవస్థలను వినియోగించుకుంటున్నారు.                                                   "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

జోడో యాత్ర విశేషాలు

మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.

కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ము, కశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేయనున్నారు.

Also Read: RBI on Loan Apps: లోన్‌ యాప్‌లపై కేంద్రం సీరియస్- RBIకు కీలక ఆదేశాలు!

Also Read: Kim Jong-un: ఇక ఆటోమెటిక్‌గా అణుదాడి- తగ్గేదేలే, కిమ్‌ కొత్త చట్టం!

Published at : 09 Sep 2022 03:49 PM (IST) Tags: CONGRESS Tamil Nadu Bharat Jodo Yatra Rahul Gandhi

సంబంధిత కథనాలు

APPSC Non-Gazetted Recruitment: ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!

APPSC Non-Gazetted Recruitment: ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!

Krishnam Raju : మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ, ప్రభాస్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్

Krishnam Raju : మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ, ప్రభాస్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్

Lakhimpur Bus Accident: గాయపడిన చిన్నారిని చూసి బోరున ఏడ్చిన ఐఏఎస్ ఆఫీసర్!

Lakhimpur Bus Accident: గాయపడిన చిన్నారిని చూసి బోరున ఏడ్చిన ఐఏఎస్ ఆఫీసర్!

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

టాప్ స్టోరీస్

TRS MP Santosh Issue : ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ - అసలేం జరిగిందంటే ?

TRS MP Santosh Issue :  ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ -  అసలేం జరిగిందంటే ?

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!