Best Year End Destinations: ఇయర్ ఎండ్ సెలబ్రేట్ చేసుకునేందుకు అద్భుతమైన ప్రదేశాలివి...
పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పే క్షణాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆ క్షణాలను మరింత అందంగా మలుచుకునేందుకు విభిన్న ప్రదేశాలకు వెళుతుంటారు. అలాంటి బెస్ట్ ప్లేసెస్ కొన్ని ఇవి..
కొత్త ఏడాదికి ఎంత ఆనందంగా స్వాగతం చెబుతామో ఏడాది మొత్తం అంతే ఆనందంగా ఉంటాం అని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. ఎప్పటిలా పని ప్రదేశాల్లోనో, ఇంట్లోనో కాకుండా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి ఆ క్షణాలు ఆస్వాదించాలని భావిస్తుంటారు కొందరు. మరి ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కి మన దేశంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలేంటో చూద్దాం..
కేరళ
భూతల స్వర్గంలా ఉండే కేరళ ఆందాలను ఆస్వాదిస్తూ కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పొచ్చు. ముఖ్యంగా అలెప్పీ, మున్నార్, కోవలం అధ్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా అలెప్పీ బోట్ హౌస్ ని పర్యాటకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
గోవా
ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కి గోవాని మించిన మంచి ప్లేస్ లేదంటారు పర్యాటకులు. అయినా గోవా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా...
ముంబై
ఎంత అన్వేషించినా తీరని ఆకర్షణ ముంబై నగరం సొంతం. ఇయర్ ఎండ్ సందర్శించడానికి బెస్ట్ ప్లేసెస్ లో ఇదొకటి
Also Read: ఆ రోడ్డుపై ఎక్కడ చూసినా డబ్బే డబ్బు.. దొరికినోళ్లకు దొరికినంత!
జైపూర్
పింక్ సిటీ అని పిలిచే జైపూర్ పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో సందర్శించడానికి అనువైన నగరం ఇది.
పుదుచ్చేరి
సహజ సౌందర్యాన్ని నింపుకున్న పుదుచ్చేరి ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడుంటే థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
లక్షద్వీప్
అరేబియా సముద్రంలో ఉన్న సహజమైన, అందమైన ద్వీపాల సమూహం లక్షద్వీప్. మనదేశంలో అత్యంత అందమైన ద్వీప సమూహాల్లో ఒకటి. పాత ఏడాదికి బైబై చెప్పి కొత్త ఏడాదిని ఆహ్వానించేందుకు బెస్ట్ వార్మ్ ప్లేస్ ఇది.
పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు
అందమైన బీచ్‌లు, ఆంత్రోపోలాజికల్ మ్యూజియంలు, కలోనియల్ జైళ్లు ఉన్న ప్లేస్ ఇది. ఈ బీచ్‌లలో సన్ బాత్ చేయడం అత్యుత్తమ అనుభూతి అంటారు పర్యాటకులు.
Also Read: బాబోయ్.. ఇదేమి యాడ్! లైఫ్ పార్ట్నర్ ఆ సైజులోనే ఉండాలట.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
కచ్, గుజరాత్
భారతదేశంలో ప్రధాన భూభాగం నుంచి వేరు చేసిన ఒక ద్వీపం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న కచ్. ఇక్కడ ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌లు, పురాతన దేవాలయాలు, పాత గుహలు చూడొచ్చు. శీతాకాలంలో జరిగే వార్షిక రన్ మహోత్సవ్ ఈ ద్వీపానికి ప్రత్యేక ఆకర్షణ.
మైసూర్, కూర్గ్
కర్ణాటక రాష్ట్రంలో ఎత్తైన పర్వతాలు, నిరంతరం పొగమంచుతో కూడిన ప్రకృతి దృశ్యాలకు నెలవైన ప్రదేశాలెన్నో ఉన్నాయి. వాటిలో కూర్గ్ ఒకటి. ప్రసిద్ధ కాఫీని ఉత్పత్తి చేసే హిల్ స్టేషన్ ఇది. అత్యద్భుతమైన వాటర్ ఫాల్స్ కి కూర్గ్ పెట్టింది పేరు. మైసూర్ కూడా ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కి బెస్ట్ డెస్టినేషన్.
అరకు
మంచుదుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు, చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం, అడుగడుగునా మనసుని కట్టిపడిసే అపూర ప్రదేశాలెన్నో ఆంధ్రా ఊటీ అరకు సొంతం. కూల్ వెదర్లో న్యూ ఇయర్ కి హాట్ వెల్ కమ్ చెప్పేందుకు బెస్ట్ ప్లేస్.
Also Read: విచిత్రం.. తన బంగ్లాను అమ్మేస్తున్న కుక్క.. విలువ రూ.238 కోట్లు!
Also Read: కరోనా పుట్టుకపై కొత్త అధ్యయనం.. తొలి కొవిడ్ కేసు అక్కడేనట!
Also Read: కోట్లాది రూపాయలు కాదని కోరుకున్నవాడ్ని పెళ్లాడిన జపాన్ రాకుమారి
Also Read: తల్లడిల్లిన తండ్రి హృదయం.. బిడ్డను కాపాడుకునేందుకు తానే శాస్త్రవేత్తగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి