News
News
X

Besharam Rang Row: 'పఠాన్ సినిమాను నీ కూతురితో కలిసి చూడు'- షారూక్‌కు స్పీకర్ సవాల్

Besharam Rang Row: పఠాన్ సినిమాను షారూక్ ఖాన్ తన కూతురితో కలిసి చూడాలని మధ్యప్రదేశ్ స్పీకర్ సవాల్ విసిరారు.

FOLLOW US: 
Share:

Besharam Rang Row: కింగ్ ఖాన్ షారూక్, హాట్ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన 'పఠాన్' సినిమాపై విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే 'బేషరం రంగ్'పై హిందూ సంఘాలతో పాటు భాజపా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 'పఠాన్' చిత్రంపై మధ్యప్రదేశ్ స్పీకర్ గిరీశ్ గౌతమ్ విమర్శలు చేశారు. షారూక్ ఖాన్‌కు సవాల్ విసిరారు.

" 'పఠాన్‌' చిత్రాన్ని షారుక్‌ ఖాన్‌ తన కూతురితో కలిసి చూడాలి. అలా చిత్రాన్ని చూసినట్లు ప్రపంచానికి తెలియజేస్తూ ఓ ఫోటో సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలి. అంతేగాక ఇలాంటి సినిమానే ప్ర‌వ‌క్త‌పై తీయాలి.                      "
-గిరీశ్ గౌతమ్‌, మధ్యప్రదేశ్‌ స్పీకర్‌ 

అంతకుముందు

'బేషరం రంగ్' పాటపై అంతకుముందు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

" బేషరం రంగ్ అనే పాట టైటిల్, దాని అర్థం అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ పాట‌లో ఉన్న కాస్ట్యూమ్‌ క‌లుషిత‌మైన మైండ్‌సెట్‌ను చాటుతుంది. కనుక పాటలో కొన్ని మార్పులు చేయాలి.. లేదంటే ఈ సినిమాను విడుదల చేయకుండా బహిష్కరిస్తాం.                                             "
-నరోత్తమ్ మిశ్రా, మధ్యప్రదేశ్ హోంమంత్రి

ఇదీ వివాదం

వచ్చే జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న పఠాన్‌ మూవీపై దేశవ్యాప్తంగా భాజపా శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలోని బేషరం రంగ్‌ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'బాయ్‌కాట్ పఠాన్' హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో  ట్రెండ్ చేస్తున్నాయి.

ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని భాజపా నేతలు విమర్శిస్తున్నారు. ఆ సాంగ్‌లో దీపిక, షారూక్ ధరించిన దుస్తుల్ని త‌ప్పుప‌డుతున్నారు.

అయితే ఈ వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. సినిమా యూనిట్‌కు మద్దతు తెలిపారు.

" కాషాయం ధరించి రేపిస్టులను సత్కరిస్తే, ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే తప్పులేదు. బ్రోకర్ ఎమ్మెల్యేలు, కాషాయ స్వామీజీలు.. మైనర్లపై అత్యాచారం చేసినా పట్టదు. కానీ ఒక సినిమాలో ఆ డ్రెస్ ధరించకూడదా?.                               "
-     ప్రకాశ్ రాజ్, సినీ నటుడు

'పఠాన్' సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా ట్రైలర్ పై కూడా నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. ఈ సినిమా హాలీవుడ్ వార్ అండ్ మార్వెల్స్ కు కాపీ లా ఉందని ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ మూవీను బ్యాన్ చేయాలంటూ కూడా కామెంట్లు వచ్చాయి. తర్వాత 'బేషరమ్ రంగ్' పాటపై కూడా ఇదే రీతిలో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పాటలో షారుక్-దీపికా కెమిస్ట్రీ బాగుందని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది సినిమా పబ్లిసిటీ కోసం మరీ ఇంత బోల్డ్ గా చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Viral News: రైల్వేశాఖ నిర్లక్ష్యం- ఆమ్లెట్‌లో బొద్దింక ప్రత్యక్షం, ఫొటోలు వైరల్!

Published at : 19 Dec 2022 03:19 PM (IST) Tags: Pathaan Besharam Rang Besharam Rang Row MP Speaker Asks SRK

సంబంధిత కథనాలు

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న " ఐ లవ్ వైజాగ్ "

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న

Hyderabad News : నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

Hyderabad News :  నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?