అన్వేషించండి

Asia's Worst City - Bengaluru : 'ఈ నగరానికి ఏమైంది?' - ఏటా 132 గంటలు ట్రాఫిక్‌లోనే, ఆసియాలోనే అత్యంత అధ్వానమైన నగరాల్లోనే..

Asia's Worst City - Bengaluru : బెంగళూరులోని ప్రజలు సగటున 10 కి.మీకు 28 నిమిషాల 10 సెకన్లు ట్రాఫిక్‌లోనే గడుపుతున్నారు. ఏడాదికి 132 గంటలపాటు రద్దీలోనే చిక్కుకుపోతున్నారు.

Asia's Worst City - Bengaluru : సిగ్నల్ దగ్గర ఓ 5 నిమిషాలు ఆగాలంటేనే తెగ చిరాకు పడిపోతూ ఉంటాం. దానికి తోడు వర్షం తోడైతే.. పరిస్థితి మామూలుగా ఉండదు. ట్రాఫిక్ రద్దీతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. రోజురోజుకూ వాహనాలను వినియోగించే వారి సంఖ్య పెరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్య వల్ల రోడ్డుపై అడుగుపెట్టాలంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇక హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకంటే ముందు మనం చెప్పాల్సింది బెంగళూరు గురించి. ట్రాఫిక్ జామ్ అనగానే చాలామందికి గుర్తొచ్చే సిటీ ఇది. కొద్ది దూరానికే గంటల గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలోనూ అనేక వార్తలు, మీమ్స్ రావడం మనం చూసే ఉంటాం. అయితే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ పరంగా ఆసియాలోనే టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది.

ట్రాఫిక్ జామ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బెంగళూరు నగరం రోజుకో అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 తెలిపిన వివరాల ప్రకారం, కేవలం 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి అక్కడి డ్రైవర్లు సగటున 28 నిమిషాల 10 సెకన్లు వెచ్చిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ పరంగా ఆసియాలోని అధ్వానమైన నగరాల్లో ఇప్పుడు బెంగళూరు ఒకటిగా నిలిచింది. అంటే భారతీయ టెక్ హబ్‌లోని నివాసితులు దాదాపు 132 గంటలు ట్రాఫిక్‍‌లోనే ఉండిపోతున్నారు. ఇక దీనికి కారణమేంటన్న విషయంపై విశ్లేషించగా.. వేగంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్టణ మౌలిక సదుపాయాలు ముందంజలో ఉన్నాయి. ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, నగరంలోని ట్రాఫిక్ సమస్య మాత్రం అలాగే ఉంటోంది. ఇక పీక్ అవర్స్, వీకెండ్స్, హాలిడేస్‌లో మాత్రం నరకమే అని చెప్పొచ్చు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Statista (@statista)

స్టాటిస్టా ప్రకారం, బెంగళూరు తర్వాత ట్రాఫిక్ జామ్ పరంగా పశ్చిమ భారతదేశంలోని పుణే రెండో స్థానాన్ని అధిగమించింది. 10 కి.మీ ప్రయాణించడానికి అక్కడి ప్రజలకు 27 నిమిషాల 50 సెకన్లు పడుతుందట. ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌లోని మనీలా (27 నిమిషాల 20 సెకన్లు) , తైవాన్‌లోని తైచుంగ్ (26 నిమిషాల 50 సెకన్లు), జపాన్‌లోని సప్పోరో (26 నిమిషాల 50 సెకన్లు), తైవాన్‌లోని కౌహ్ సివుంగ్ (26 నిమిషాలు), జపాన్‌లోని నగోయా (24 నిమిషాల 20 సెకన్లు), ఇండొనేషియాలోని జకార్తా (23 నిమిషాల 20 సెకన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మొత్తం 6 ఖండాలలోని 55 దేశాలలో 387 నగరాలపై అధ్యయనం చేసిన టామ్‌టామ్ ట్రాఫిక్ సూచిక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలను వాటి సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, కార్భన్ డై యాక్సైడ్(CO2)ఉద్గారాలు వంటి వాటిని ఆధారంగా చేసుకుని అంచనా వేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే.. యూకేలోని లండన్‌ అత్యంత నెమ్మదిగా వాహనాలు కదిలే సిటీగా పేరొందింది. ఇక్కడ సగటున 10 కిలోమీటర్ల దూరానికే 37 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుందట.

Also Read : Republic Day : రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రిట్రీట్ టిక్కెట్ల విక్రయానికి డేట్ ఫిక్స్ - ఒక్కో టిక్కెట్ ధరెంతంటే..

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Protest:ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget