Bengaluru: Bengaluru: పెళ్లికి పిల్లని చూసి పెట్టలేకపోవడం నేరమే - మ్యాట్రిమొనికి రూ.60 వేల జరిమానా !
Matrimony company: పెళ్లికుమార్తెను చూపిస్తానని హామీ ఇచ్చిందో మ్యాట్రిమొనీ సైట్. కానీ చూపించలేకపోయింది. ఫలితంగా జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది.
Bengaluru court orders matrimony company to pay ₹60,000 to groom for failing to find bride: ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో పెళ్లి సంబంధాలు చూసి పెట్టే మ్యాట్రిమొనియల్ సంస్థల సంఖ్య కూడా పెరిగిపోతోంది. అయితే చాలా సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నాయి కానీ పెళ్లి కూతుళ్లను మాత్రం చూపించలేకపోతున్నారు. ఇలాంటి సంస్థలకు బెంగళూరు కోర్టు గట్టి వార్నింగ్ పంపింది. ఓ సంస్థకు అరవై వేలు జరిమానా విధించింది.
బెంగళూరులోని ఓ వ్యక్తి తన కుమారుడు బాలాజీకి మంచి పెళ్లి సంబంధం చూడాలని ఓ మ్యాట్రిమొనియల్ ఆఫీసుకు వెళ్లాడు. పెళ్లికి అమ్మాయే కదా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుని రూ.30 వేలు ఫీజుకట్టి మీరు ఆ విషయం మర్చిపోవాలని సలహా ఇచ్చారు. వారు ముఫ్పై వేల రూపాయలు కట్టి ఇక పెళ్లి అయిపోయినట్లే అనుకున్నారు. నెల అంటే నెల రోజుల్లో మంచి సంబంధాన్ని తీసుకు వస్తామని వారు హామీ ఇచ్చారు.కానీ మీరు మర్చిపోండని చెప్పిన వారు... ఆ విషయాన్ని వారు మర్చిపోయారు. నెల రోజులు అయినా ఒక్క సంబంధాన్ని కూడా చూపించలేదు.
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
దాంతో బాలాజీ తండ్రి మ్యాట్రిమొనియల్ ఆఫీసుకు వెళ్లి మీరు చెప్పిన గడువు ముగిసిపోయిందని సంబంధం ఎక్కడ అని ప్రశ్నించారు.దానికి ఆ ఆఫీసు వాళ్లు ముప్పై వేలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని .. మరో నెల గడువు కోరారు. బాలాజీ తండ్రి కూడా కాస్త లేటయితే అయింది.. అవ్వాల్సిన ఆలస్యం ఇప్పటికే అయిపోయింది కాబట్టి వెయిట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. మరో నెల అయినప్పటికీ ఒక్కటంటే ఒక్క ఫోన్ కాల్ రాలేదు. అసలు ఆ ఆఫీసు వాళ్లు పట్టించుకోవడం మానేశారు. తన వద్ద ముఫ్పై వేలు వసూలు చేయడమే కాకుండా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారని ఆ వ్యక్తికోపగించుకున్నారు. ఇలా వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పి వెంటనే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
మృత్యువు ఎలా వస్తుందో చెప్పలేం - పుట్‌బాల్ మ్యాచ్‌లో పిడుగు - అక్కడికక్కడే చనిపోయిన ప్లేయర్ !
బెంగళూరు వినియోగదారులకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు ఆధారాలను చూసిన తర్వాత హామీ ఇచ్చిన ప్రకారం బాలాజీ కుమారుడికి పిల్లను వెదికి పెట్టడంలో నిర్లక్ష్యం చూపించారని నిర్ధారించుకుంది. హామీ ఇచ్చిన సేవలు చేయనందుకు ఆ సంస్థ వసూలుచేసిన దానికి రెట్టింపుగా జరిమానా విధించింది. ఈ తీర్పు చాలా మ్యాట్రిమొనియల్ సైట్లకు మేలుకొలుపులాంటిదే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న డిమాండ్ ను బట్టి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తున్న ఆఫీసులు, సైట్లు.. పెళ్లిసంబంధాలను మాత్రం పెద్దగా కుదర్చడం లేదు.