Ayodhya Mosque: అయోధ్య రాముడి ఆలయంతో పాటు మసీదు నిర్మాణం, ఒకేసారి పూర్తైతే రికార్డే
Ayodhya Mosque: అయోధ్య రామమందిరంతో పాటు మసీదు నిర్మాణమూ పూర్తవుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
Ayodhya Mosque:
ఒకేసారి పూర్తవుతాయా..?
అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఇప్పటికే ట్రస్ట్ వెల్లడించింది. అయితే...ఈ ఆలయంతో పాటు మసీదు నిర్మాణ కూడా అదే గడువులోగా పూర్తవుతుందని ట్రస్ట్ తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మసీదు నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. Indo Islamic Cultural Foundation Trustకు చెందిన ఓ సీనియర్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంటే...రాముడి ఆలయంతో పాటు మసీదు కూడా ఒకేసారి పూర్తవుతుందన్నమాట. ఇదే జరిగితే...అది చరిత్రాత్మకం అవుతుందని అంటున్నారు. రామ్ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో ముస్లింలకు చెందిన స్థలంలో కచ్చితంగా మసీదు నిర్మించాలని ఆదేశించింది. ముస్లింలు వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఈ తీర్పునిచ్చింది. యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటైంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మసీదు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ట్రస్ట్ సెక్రటరీ అధర్ హుస్సేన్ పలు కీలక విషయాలు వెల్లడించారు. "మసీదు, హాస్పిటల్, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు సంబంధించిన మ్యాప్‌ను ఈ నెలాఖరులోగా అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ మాకు అందిస్తుందన్న నమ్మకముంది" అని అన్నారు. ఆ మ్యాప్ రాగానే మసీదుతో పాటు మిగతా నిర్మాణాల పనులు మొదలు పెడతామని వెల్లడించారు. మసీదు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని మిగతా అన్నీ నిర్మించేందుకు వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ వేచి చూడాలని చెప్పారు. నిజానికి...ఈ గడువులోగా పూర్తవ్వాలన్న నిబంధన ఏమీ పెట్టుకోలేదని, కానీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ మసీదు పేరు "ధనిపూర్ అయోధ్య మసీద్"గా నిర్ధరించున్నట్టు చెప్పారు. మిగతా నిర్మాణాలున్న కాంప్లెక్స్ పేరుని "మౌల్వి అహ్మదుల్లా షా కాంప్లెక్స్"గా పెట్టాలని భావిస్తున్నామని వివరించారు.
వేగంగా రామ మందిర నిర్మాణ పనులు..
భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 50% పనులు పూర్తైనట్టు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. 2024 జనవరిలో మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించి...భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరవనున్నట్టు తెలిపింది. రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Ram Janmabhoomi Teerth Kshetra Trust)జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఇందుకు సంబంధించి మరి కొన్ని వివరాలు వెల్లడించారు.
"మరో వెయ్యేళ్ల పాటు ఈ ఆలయం నిలిచిపోతుంది. భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలబడుతుంది" అని స్పష్టం చేశారు. మొత్తం 1800 ఎకరాల్లో ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయానికి 392 స్తంభాలు, 12 ద్వారాలు ఉంటాయి. ఐరన్ రాడ్స్ వినియోగించ కుండానే...వీటి నిర్మాణం కొనసాగుతోంది. రాళ్లను అనుసంధానించటానికి ఐరన్ రాడ్స్ బదులుగా...కాపర్ చిప్స్‌ను వినియోగిస్తున్నారు. గర్భగుడిలో 160 స్తంభాలుంటాయి. మొదటి అంతస్తులోనే 82 పిల్లర్స్ ఉంటాయని ట్రస్ట్ తెలిపింది.
Also Read: Lok Sabha Election 2024: అప్పుడే మొదలైన "మిషన్ 2024" ఫివర్, వ్యూహాలు రెడీ చేసుకుంటున్న బీజేపీ