అన్వేషించండి

Ather Rizta Electric Scooter News: ఏథర్ రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్: కొనే ముందు ఈ 5 విష‌యాలు తెలుసుకోండి

ఇండియ‌న్ మార్కెట్లో ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకుంటూ సరికొత్త సేల్స్ రికార్డులు సృష్టిస్తున్న ఏథర్ రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం.

Ather Rizta Electric Scooter Top Features and Buying Guide: భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో మెయిన్‌స్ట్రీమ్ తయారీదారుగా ఎదగాలనే ఏథర్ ఎనర్జీ కంపెనీ లక్ష్యానికి ఏథర్ రిజ్తా (Ather Rizta) స్కూటర్ ఒక పెద్ద పిల్లర్‌లా నిలిచింది. ఏప్రిల్ 2024లో లాంచ్ అయిన ఈ ఫ్యామిలీ-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంఫర్ట్, ప్రాక్టికాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే ఇది సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్‌గా నిలిచింది. కేవలం రెండేళ్లలోనే 3 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని దాటేసి, ఏథర్ కంపెనీ మొత్తం అమ్మకాల్లో 76 శాతం వాటాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ వద్ద దీని ప్రారంభ ధర రూ. 1.10 లక్షలుగా ఉంది. మీరు గనుక ఈ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ముందే తెలుసుకోవలసిన టాప్ 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి.

Read Also: Skoda Epiq Electric SUV Unveiled: స్కోడా ఎపిక్ ఈవీ అన్‌వీల్: 440 కిలోమీటర్ల రేంజ్ తో రాబోతున్న స్కోడా చీపెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

బ్యాటరీ ఆప్షన్లు, రేంజ్..

ఏథర్ రిజ్తా మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి రిజ్తా ఎస్ (Rizta S), రిజ్తా జెడ్ 2.9 కిలోవాట్ అవర్ (Rizta Z 2.9 kWh), రిజ్తా జెడ్ 3.7 కిలోవాట్ అవర్ (Rizta Z 3.7 kWh). ఇందులో 2.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడళ్లు సింగిల్ చార్జ్‌పై 123 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తాయని కంపెనీ చెప్తోంది, అయితే రియల్ వరల్డ్ లో ఇది 80 నుండి 105 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్-ఎండ్ మోడల్ లో ఉన్న 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 159 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఆఫర్ చేస్తుంది, ఇది నిజ జీవితంలో 100 నుండి 125 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనితో పాటు కంపెనీ రూ. 14,000 నుండి రూ. 20,000 అదనపు ధరతో 'ప్రో ప్యాక్' (Pro Pack) అందిస్తోంది. ఇది డాష్‌బోర్డ్‌పై గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్, హిల్ హోల్డ్ కంట్రోల్, స్కిడ్ కంట్రోల్ (ట్రాక్షన్ కంట్రోల్), మ్యాజిక్ ట్విస్ట్ (రీజెనరేటివ్ బ్రేకింగ్) లాంటి స్మార్ట్ ఫీచర్లను అన్‌లాక్ చేస్తుంది.

Read Also: Best CNG SUVs Under 10 Lakhs: 10 లక్షల బడ్జెట్లో బెస్ట్ సీఎన్‌జీ ఎస్‌యూవీలు - పెట్రోల్ భారం తగ్గించే టాప్ కార్ల లిస్ట్ ఇదే 

డైలీ కమ్యూటింగ్ కోసం..

ఈ స్కూటర్ స్పోర్టీ మోడల్ అయిన ఏథర్ 450 సిరీస్ లాగా రేసింగ్ కోసం కాకుండా సాధారణ రోజువారీ ప్రయాణాల కోసం డిజైన్ చేశారు. ఇందులో 4.3 కిలోవాట్ పీఎమ్‌ఎస్ఎమ్ మోటార్ ఉపయోగించారు, ఇది స్కూటర్‌కు గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇస్తుంది. ఇది కేవలం 3.7 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ కి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ వారంటీ. సాధారణంగా మార్కెట్లో 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తుండగా, ఏథర్ ప్రో ప్యాక్ ఎంచుకునే కస్టమర్లకు 5 ఏళ్లు లేదా 60,000 కిలోమీటర్ల పొడిగించిన వారంటీ లభిస్తుంది. అంతేకాకుండా ఆప్షనల్ గా 8 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారంటీని పెంచుకునే సదుపాయం కస్టమర్లకు అదనపు విలువను ఇస్తుంది.

స్పేస్, ప్రాక్టికాలిటీపై స్పెషల్ ఫోకస్..

ఫ్యామిలీ రైడింగ్ అవసరాలకు తగ్గట్టుగా రిజ్తా డిజైన్ లో స్పేస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 900 మిమీ పొడవాటి ఫ్లాట్ సీటు, తక్కువ ఎత్తు ఉన్న 780 మిమీ సీట్ హైట్, వెడల్పాటి ఫ్లాట్ ఫుట్‌బోర్డ్ ఇచ్చారు. ఇది పొడవుగా ఉండే రైడర్లకు, లగేజ్ క్యారీ చేయడానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మొత్తంగా 56 లీటర్ల భారీ కెపాసిటీ లభిస్తుంది. సీటు కింద 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ తో పాటు ముందు భాగంలో అదనంగా 22 లీటర్ల యాక్సెసరీ ఫ్రంక్ (Frunk) బాక్స్ లభిస్తుంది. నిత్యావసర వస్తువులు, హెల్మెట్లను దాచుకోవడానికి ఈ స్పేస్ ఎంతో ఉపయోగపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Rishabh Pant Homecoming Strategy: ఢిల్లీ మిడిలార్డర్‌కు పంత్ సరైన అస్త్రం.. కుల్దీప్ ట్రేడింగ్ వెనుక అసలు ప్లాన్ ఇదేనంటూ డీసీ కోచ్ గంగూలీ విశ్లేషణ
ఢిల్లీ మిడిలార్డర్‌కు పంత్ సరైన అస్త్రం.. కుల్దీప్ ట్రేడింగ్ వెనుక అసలు ప్లాన్ ఇదేనంటూ డీసీ కోచ్ గంగూలీ విశ్లేషణ
ABP Desam Top 10, 7 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 7 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget