By: ABP Desam | Updated at : 17 Jan 2022 09:26 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
అఫ్గానిస్థాన్ లో భూకంపం(ప్రతీకాత్మక చిత్రం)
అఫ్గానిస్థాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. అఫ్గానిస్థాన్ పశ్చిమప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.6 నమోదైంది. భూకంపం తీవ్రతగా చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రావిన్స్ బ్యాజీస్ ప్రాంతంలో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు.
Also Read: Republic Day 2022: గణతంత్ర వేడుకలకు ఘనంగా వాయుసేన ఏర్పాట్లు.. 75 యుద్ధవిమానాలతో విన్యాసాలు
#BREAKING At least 12 killed in western Afghanistan earthquake: district official pic.twitter.com/u2hc0wa7Yt
— AFP News Agency (@AFP) January 17, 2022
ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో మరణాలు సంభవించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. శిథిలాల కింద బాధితులు ఉండవచ్చని భావిస్తున్నారు. బాధితుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఖదీస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రకటించారు.
Also Read: Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!
మూడ్రోజుల క్రితం జమ్ము కశ్మీర్ లో భూప్రకంపనలు
మూడు రోజుల క్రితం జమ్ము కశ్మీర్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. జమ్ము కశ్మీర్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించింది. అఫ్గానిస్థాన్‌లోని హిందు కుష్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో భూమి కంపించదని స్థానికులు తెలిపారు. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పాకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతంలోనూ 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పాకిస్తాన్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అఫ్గానిస్థాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 100 కి.మీ లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని తెలిపింది. పెషావర్, మన్షేరా, బాలాకోట్, చర్సాడాతో సహా అనేక నగరాల్లో ప్రకంపనలు వచ్చాయి. అటు ఇండోనేషియాలోనూ భూప్రకంపనలు సంభవించాయి. 6.6 తీవ్రతతో భూమి కంపించినట్టు స్థానిక అధికారులు తెలిపారు.
Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Karimnagar News : సిరిధాన్యాలతో సిరులు కురిపిస్తున్న మగువలు, విదేశాలకు బిస్కెట్లు, కేకుల ఎగుమతి
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు