Asia University Rankings: బెంగళూరు IISC యూనివర్సిటీ రికార్డు, ఆసియా టాప్ 50 వర్సిటీల లిస్ట్‌లో చోటు
Asia University Rankings: బెంగళూరులోని IISCకి ఆసియాలోనే అత్యుత్తమ యూనివర్సిటీల లిస్ట్‌లో 48వ ర్యాంకు సాధించింది.
Asia University Rankings:
48వ ర్యాంకు..
బెంగళూరులోని Indian Institute of Science (IISc) ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీగా రికార్డు సృష్టించింది. ఇటీవలే విడుదల చేసిన Times High Education Asia University Rankings 2023 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆసియాలోనే అత్యుత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో 48వ స్థానంలో IISc నిలవగా...ఇండియాకు చెందిన రెండో అత్యుత్తమ యూనివర్సిటీగా కర్ణాటకలోని మైసూరుకు చెందిన JSS Academy of Higher Education and Research చోటు సంపాదించుకుంది. 68వ ర్యాంక్‌ని సాధించింది. ఆసియాలోని మొత్తం 100 టాప్ యూనివర్సిటీల్లో ఇండియాకు చెందిన మరో రెండు యూనివర్సిటీలూ ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని బజోల్‌లో ఉన్న Shoolini University 77వ ర్యాంకు సాధించగా...కేరళలోని Mahatma Gandhi University 95వ ర్యాంకు సాధించింది. ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది చైనాకు చెందిన Tsinghua University. అంతే కాదు. సెకండ్ ప్లేస్‌లో అదే చైనాకు చెందిన Peking University ఉంది. సింగపూర్‌లోని The National University మూడో ర్యాంకు దక్కించుకుంది. టాప్ 50లో ఇండియాకు చెందిన ఓ యూనివర్సిటీ ఉండగా...టాప్ 100లో నాలుగు, టాప్ 200లో 18 ఉన్నాయి. భారత్‌కు చెందిన యూనివర్సిటీలో ఇలా అంతర్జాతీయ గుర్తింపు పొందడంపై Times High Education హర్షం వ్యక్తం చేసింది. ఇండియా ఇన్నోవేటివ్‌గా మారుతోందనడానికి ఇదే నిదర్శనమని తేల్చి చెబుతోంది. గత 11 ఏళ్లలో భారత్‌లో అత్యున్నత విద్యలో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించింది.
మరి కొన్ని వర్సిటీలు..
మరి కొన్ని ఇండియన్ యూనివర్సిటీలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌కి చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) 106వ ర్యాంకు సాధించింది. ఆ తరవాత తమిళనాడుకి చెందిన అలగప్ప యూనివర్సిటీ 111వ ర్యాంకు, సవీత యూనివర్సిటీ 113వ ర్యాంకు, ఢిల్లీలోని జమియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీకి 128వ ర్యాంకులు దక్కాయి. పంజాబ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్‌కి 131వ ర్యాంకు రాగా...ఢిల్లీలోని Indraprastha Institute of Information Technology కి 137వ ర్యాంకు లభించింది. మొత్తం ఈ లిస్ట్‌లో ఇండియాకి చెందిన 75 యూనివర్సిటీలు ఉండగా...అత్యధికంగా జపాన్‌కి చెందిన 117 యూనివర్సిటీలున్నాయి. చైనావి 95,ఇరాన్‌వి 65, టర్కీవి 61 యూనివర్సిటీలున్నాయి.
Also Read: Gaganyaan: మరో చరిత్రాత్మక ప్రయోగానికి ఇస్రో రెడీ, ఆగస్టు చివర్లో గగన్‌యాన్ అబార్ట్ మిషన్