Aryan Khan Drug Case: ఆర్యన్ ఖాన్‌కు మూడోసారి కూడా బెయిల్ నిరాకరణ
ఆర్యన్ ఖాన్‌కు మరోసారి బెయిల్ నిరాకరించింది కోర్టు. అయితే ఎన్‌సీబీ సమాధానం ఆధారంగా కోర్టు.. బెయిల్‌పై బుధవారం నిర్ణయం తీసుకోనుంది.
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ముంబయి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. శుక్రవారం నుంచి ఆర్యన్ ఖాన్ ముంబయి జైలులోనే ఉన్నాడు. మొత్తంగా మూడుసార్లు ఆర్యన్ ఖాన్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది. బుధవారం ఈ పిటిషన్‌ను ముంబయి సెషన్స్ కోర్టు ముందుకు బుధవారం 11 గంటలకు విచారణకు రానుంది.
Drugs-on-cruise case: Special NDPS court in Mumbai to hear accused Aryan Khan and others' bail pleas on Wednesday
— ANI (@ANI) October 11, 2021
(File photo) pic.twitter.com/GnckOGYAKt
ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై ఎన్‌సీబీని బుధవారం సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది. ఆ రోజు బెయిల్‌పై నిర్ణయం తీసుకోనుంది కోర్టు.
ఏం జరిగిందంటే..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. సోమవారం అతడిని ముంబయి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంతకు ముందే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతూ ఆర్యన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్యన్‌కు బెయిల్‌ను నిరాకరించిన న్యాయస్థానం.. అతనికి ఈ నెల 7వ తేదీ వరకూ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
Also Read:India China Military Talks: మళ్లీ అదే కథ.. భారత్- చైనా సైనిక చర్చల్లో ఫలితం శూన్యం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి