Kashmiri Terrorists: డ్రోన్స్‌తో వెదికి మరీ కశ్మీర్ టెర్రరిస్టుల్ని చంపుతున్నారు - సైన్యం వేట అదుర్స్ - వీడియోలు వైరల్
Kashmir: కశ్మీర్ టెర్రరిస్టుల్ని వెదికి మరీ చంపుతోందిసైన్యం. డ్రోన్ల సాయంతో వారు ఎక్కడ నక్కారో తెలుసుకుని వెళ్లి చంపేసి వస్తున్నారు.

Army killing terrorists in Kashmir: ఆపరేషన్ సిందూర్ ను తాత్కాలికంగా ఆపిన సైన్యం.. ఆపరేషన్ కెల్లర్ ను ప్రారంభించింది. కశ్మీర్ లోని సోఫియాన్ ప్రాంతంలో నక్కిన టెర్రరిస్టుల్ని చంపేందుకు ఈ ఆపేరషన్ ప్రారంభించారు. గత రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఆరుగురు టెర్రరిస్టుల్ని హతమార్చారు. వీరంతా ఎక్కడ నక్కి ఉన్నారో సైన్యం సులువుగా గుర్తిస్తోంది. డ్రోన్లను..అనుమానిత ప్రాంతాలకు అనుమానం రాకుండా పంపి.. ఆపరేషన్ చేస్తున్నారు.
ఈ డ్రోన్ వీడియో ఒకటి వైరల్ అయింది. టెర్రరిస్టులు ఎక్కడ నక్కి ఉన్నారోఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
#DroneFootage has captured the moments before 03 #terrorists were neutralised in an #Encounter with security forces in #Tral pic.twitter.com/1HIpjpBB5y
— Jammu Ladakh vision (@jammu_ladakh) May 15, 2025
ఉగ్రవాదులు ఓ చోట నక్కి ఆయుధాలు సర్దుకోవడం సహా.. వారి స్థావరాల్లోని అన్ని విషయాలను.. ఈ డ్రోన్లు రికార్డు చేస్తున్నాయి. ఆచూకీ పట్టుకుని వెళ్లి భారత బలగాలు కాల్చి పడేస్తున్నాయి.
आतंकियों के एनकाउंटर का लाइव वीडियो: सामने आया त्राल एनकाउंटर का ड्रोन फुटेज, आतंकी के हाथ में बंदूक और चेहरे पर साफ दिख रही दहशत#TralEncounter #KashmirNews #DroneFootage #TerroristEncounter #IndianArmy https://t.co/T4jSOIEWcf
— Lallu Ram (@lalluram_news) May 15, 2025
ఇటీవల పహల్గాం ఉగ్రదాడి.. అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల కారణంగా పలు ప్రాంతాల్లో భారత ఆర్మీ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఉగ్రవాదుల ఏరివేతకు అన్ని చర్యలు చేపట్టింది. అనుమానస్పదంగా కనిపించిన వారిని సైతం వివరాలు ఆరా తీసి, తనిఖీలు కొనసాగిస్తుున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల పోస్టర్లను భద్రతా సంస్థలు ఏర్పాటు చేశాయి. షోపియాన్‌లోని వివిధ ప్రాంతాలలో కనిపించిన ఈ పోస్టర్లు 2019లో పుల్వామా తరువాత కాశ్మీర్ లోయలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల బహుమతిని ఇస్తామని ప్రకటించారు. ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఏ భయం లేకుండా తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు హామీ ఇచ్చారు. ఉగ్రవాదులందర్నీ తుడిచి పెట్టేలా ఆపరేషన్ కెల్లర్ నిర్వహిస్తున్నారు.
BIG WIN in Tral Encounter:
— Anuvesh Rath (@AnuveshRath) May 15, 2025
Drone footage of encounter
Massive success for J&K Police, Indian Army & intel units.
Stay tuned for more updates #TralEncounter #Kashmir #JeM #IndianArmy #JKPolice #CounterTerrorism #IndiaFightsTerror #BreakingNews #NationalSecurity #FollowForUpdates pic.twitter.com/4e7g3vmbFj
ఇప్పటికే టెర్రరిస్టులు ఆనవాళ్లను ఆర్మీ కనిపెట్టింది. రహస్య స్థావరాలతో పాటు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా కనిపెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాల్చేయాలని నిర్ణయించుకున్నారు.





















