అన్వేషించండి

Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !

Women Undressing Apps: సాంకేతికత రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతాలు చేసే వారు కొందరు అయితే, దానిని దుర్వినియోగం చేసేవారు మరికొందరు.

AI In Women Undressing:  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతాలు చేసే వారు కొందరు అయితే, దానిని దుర్వినియోగం చేసేవారు మరికొందరు. టెక్నాలజీతో ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుందని చెప్పొచ్చు. తాజా టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కొందరు తప్పుడు దారిలో ఉపయోగిస్తున్నారు. మహిళలను వివస్త్రలు  (Women Undressing)గా చూపించేందుకు ఉపయోగిస్తున్నారు. ఇటువంటి యాప్‌‌లు (Undressing Apps) , వెబ్‌సైట్‌ (Undressing Websites)లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయని పరిశోధకులు తెలిపారు.

సెప్టెంబరులోనే, 24 మిలియన్ల మంది మహిళలను వివస్త్రలు, న్యూడ్‌గా చూపించే వెబ్‌సైట్‌లను సందర్శించారని సోషల్ నెట్‌వర్క్ విశ్లేషణ సంస్థ గ్రాఫికా సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ సంస్థ వివరాల ప్రకారం..  ‘న్యూడిఫై’ సేవల మార్కెటింగ్ కోసం ప్రముఖ సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సోషల్ మీడియా X (ట్విటర్), రెడిట్, ఇతర సోషల్ మీడియాలో అన్‌డ్రెస్సింగ్ యాప్‌ల ప్రకటనల సంఖ్య 2,400 శాతం పెరిగిందని పరిశోధకులు తెలిపారు. 

ఈ యాప్‌లు అన్నీ ఒక వ్యక్తి నగ్నంగా ఉండే చిత్రాన్ని తయారుచేసేందుకు AIని ఉపయోగిస్తాయి. వీటిలో చాలా వరకు మహిళలను న్యూడ్‌గా చూపించేందుకు మాత్రమే పనిచేస్తాయి. కృత్రిమ మేధస్సులో అశ్లీల చిత్రాలను రూపొందిండం భవిష్యత్తులో ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంటుందనే ఆందోళన ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే చిత్రాలు, వీడియోలను తీసుకుని ఇప్పటికే డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీకి పాల్పడుతున్నారు. 

గతంలో ఉన్న టెక్నాలజీతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతమైన చిత్రాలను సృష్టించగలవని గ్రాఫికా పేర్కొంది. AIలు ఓపెన్ సోర్స్ అవడం వల్ల, యాప్ డెవలపర్‌లు వాటిని ఉపయోగించుకుని డీప్ ఫేక్‌కు పాల్పడుతున్నారు. మునుపటి డీప్‌ఫేక్‌లు అస్పష్టంగా ఉండేవని, ప్రస్తుతం దేనినైన నిజం అనిపించేలా వాస్తవికంగా తయారు చేయొచ్చని గ్రాఫికా సంస్థ విశ్లేషకుడు శాంటియాగో లకాటోస్ తెలిపారు.

సోషల్ మీడియాలో Xలో విప్పే యాప్‌ ఫొటోలను పోస్ట్ చేసి నగ్న చిత్రాలను సృష్టించవచ్చనే ప్రకటనలను యాప్‌లు ఇస్తున్నాయి. అదే సమయంలో గూగుల్, యూట్యూబ్‌లో వాటికి సంబంధించిన పదం వెతికితే వెంటనే ఆ యాప్ కనిపించేలా ప్రచారం చేస్తున్నారు.  అయితే లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను కలిగి ఉంటే ప్రకటనలను కంపెనీ అనుమతించదని గూగుల్ ప్రతినిధి తెలిపారు. సందేహాస్పద ప్రకటనలను సమీక్షిస్తామని, తమ నిబంధనలు ఉల్లంఘించే వాటిని తీసివేస్తున్నట్లు వెల్లడించారు. ఒక రెడిట్ ప్రతినిధి మాట్లాడుతూ.. లైంగిక, అసభ్యకరమైన విషయాలను సైట్ నిషేధిస్తుందని, ఇప్పటికే అనేక డొమైన్‌లను నిషేధించిందని తెలిపారు. అయితే దీనిపై X (ట్విటర్) ప్రతి స్పందించలేదు.

ట్రాఫిక్ పెరుగుదలతో పాటు, కొన్ని సేవలు, నెలకు $9.99 వసూలు చేస్తాయని,  తద్వారా వారు చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తూ వ్యాపారం చేస్తున్నారని  లకాటోస్ చెప్పారు. ప్రముఖుల డీప్ ఫేక్, నకిలీ అశ్లీల వీడియోలు ఇంటర్నెట్లో చాలా కాలంగా ఉంటున్నాయి. తాజా AI సాంకేతికత డీప్‌ఫేక్ సాఫ్ట్‌వేర్‌ను సులభతరం, ప్రభావవంతం చేసిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ లక్ష్యాలతో సాధారణ వ్యక్తులు దీన్ని ఎక్కువగా చేయడం చూస్తున్నామని, భవిష్యత్తులో హైస్కూల్ పిల్లలు, కళాశాలలో ఉన్నవారిలో దీని ప్రభావాన్ని చూస్తారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ నిషేధించే ఫెడరల్ చట్టం ప్రస్తుతం ఏదీ లేదు. కానీ మైనర్ల చిత్రాలపై నిషేధం విధించింది. నవంబర్‌లో నార్త్ కరోలినాలో పిల్లల డీప్ ఫేక్ ఫొటోలు తయారు చేసిన మానసిన వైద్యుడికి  40 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, డీప్‌ఫేక్ సృష్టించడం నిషేధించే చట్టం ప్రకారం ఇది తొలి కేసు. టిక్‌టాక్ ‘అన్‌డ్రెస్’ అనే కీవర్డ్‌ని బ్లాక్ చేసింది. ఎవరైనా ఈ పదం కోసం ఎవరైనా వెతుకుతున్నప్పుడు వార్నింగ్ మెస్సేజ్ ఇస్తుంది. అలాగే మెటా సైతం బట్టలు విప్పే యాప్‌ల‌ను వెతికేందుకు ఉపయోగించే కీలక పదాలను బ్లాక్ చేయడం ప్రారంభించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
Embed widget