Breaking News Live Telugu Updates: ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి గోవాలో అరెస్టు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
Retail Inflation Data: భారత దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. 2022 అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైన వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation), నవంబర్‌లో మరింత తగ్గి 5.88 శాతానికి దిగి వచ్చింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి. ఏడాది క్రితం, 2021 నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.91 శాతంగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఈ డేటాను విడుదల చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లక్ష్యిత స్థాయి అయిన 6 శాతం కంటే దిగువకు రిటైల్ ఇన్‌ఫ్లేషన్ చేరడం విశేషం. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న కంఫర్ట్ లెవెల్ 2-6 శాతం. దేశంలో ద్రవ్యోల్బణాన్ని ఈ రేంజ్‌లోనే ఉంచాలన్నది RBI లక్ష్యం. 2022 జనవరి నుంచి అక్టోబర్ వరకు, వరుసగా 10 నెలల పాటు 6 శాతం కంఫర్ట్ లెవెల్ పైనే నమోదై చిల్లర ద్రవ్యోల్బణం.. తాజాగా నవంబర్‌లో 6 శాతం లోపునకు దిగి వచ్చింది. ద్రవ్యోల్బణం కట్టడికి రెపో రేటును దఫదఫాలుగా RBI పెంచుతూ వచ్చింది. ఈ ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు, విడతల వారీగా 4 శాతం నుంచి 2.25 శాతం పెంచి 6.25 శాతానికి చేర్చింది. రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన చర్యలు ఫలించి దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది.
ఆహార ద్రవ్యోల్బణంలో భారీ తగ్గుదల
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటా ప్రకారం... ఆహార పదార్థాల ధరలు బాగా తగ్గడం వల్ల చిల్లర ద్రవ్యోల్బణం రేటులో తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం 2022 అక్టోబర్‌లో 7.01 శాతంగా ఉండగా, నవంబర్‌లో 4.67 శాతానికి తగ్గింది. అటు పట్టణ ప్రాంతాలు, ఇటు గ్రామీణ ప్రాంతాలు రెండు ఏరియాల్లోనూ ఆహార పదార్థాల రేట్లు దిగి వచ్చినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించింది.
అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.53 శాతంగా ఉండగా, నవంబర్‌లో 3.69 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.30 శాతంగా ఉండగా, నవంబర్‌లో 5.22 శాతానికి తగ్గింది. ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం -8.08 శాతానికి తగ్గింది. పండ్ల (ఫ్రూట్స్) ద్రవ్యోల్బణం 2.62 శాతంగా ఉంది.
వడ్డీ రేట్ల పెంపు ఆగుతుందా?
ద్రవ్యోల్బణం ఇలా తగ్గుతూనే ఉంటే, రాబోయే సంవత్సరంలో వడ్డీ రేటు పెంపునకు బ్రేక్ పడవచ్చు. రెపో రేటు పెంపు ప్రక్రియ ఆగిపోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం రేటులో పతనం పెరిగితే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ఉంది. డిసెంబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం ఎంత మేర నమోదవుతుందనే దానిపై ఆధారపడి, ఫిబ్రవరి జరిగే RBI MPC కమిటీలో రెపో రేటు పెంపుపై నిర్ణయం తీసుకుంటారు.
టెక్స్‌టైల్, ఫుట్‌వేర్, ఆయిల్, పవర్ సహా ఇతర విభాగాల ద్రవ్యోల్బణం ఇప్పటికీ 6 శాతం పైనే కొనసాగుతోంది. కాబట్టి, డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం మళ్లీ 6.5 శాతానికి చేరొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా. డిసెంబర్‌లో ద్రవ్యో
ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి గోవాలో అరెస్టు
హైదరాబాద్ ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ గోవాలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మన్నెగూడలో యువతిని కిడ్నాప్ చేసిన అనంతరం నల్గొండ వైపు కారులో తీసుకెళ్లి అక్కడ యువతిని వదిలేసి నవీన్ పరారయ్యాడు. యువతి కిడ్నాప్, ఆమె ఇంటిపై దాడి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
టి.కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కార్యాలయం సీజ్
తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కొనుగోలు చేసిన హైదరాబాద్ లోని కార్యాలయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో ఆఫీస్ ను సీజ్ చేసిన పోలీసులు. ఆపన్నహస్తం పేరుతో సునీల్ ఫేస్ బుక్ ఖాతాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మల్లు రవి, షబ్బీర్ అలీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి: టీటీడీ ఇవో ధర్మారెడ్డికి నెల జైలు శిక్ష విధించిన హైకోర్టు
అమరావతి: టీటీడీ ఇవో ధర్మారెడ్డికి నెల జైలు శిక్ష విధించిన హైకోర్టు
ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయమని గతంలో ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
హైకోర్టు ఆదేశాలను అమలు చేయని ధర్మారెడ్డి
ధర్మారెడ్డి పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
పిటిషన్ను విచారించి ధర్మారెడ్డికి వారం జైలు శిక్ష 2000 జరిమానా విధించిన హైకోర్టు
జరిమానా చెల్లించకపోతే మారో వారం అదనపు జైలు శిక్ష పొడిగించాలని ఆదేశం
వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు మరోసారి గ్రీన్ సిగ్నల్
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన షరతులను గుర్తుంచుకోవాలని సూచించింది. అయితే పోలీసులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
హైదరాబాద్‌లో ప్రియురాలిపై ప్రియుడు దాడి- అడ్డుకున్న యువతి తల్లికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకున్న మరో యువతి తల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.