అన్వేషించండి

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

CM Jagan Kadapa Tour: ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారు అయింది. డిసెంబర్ 2, 3వ తేదీల్లో జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు.

CM Jagan Kadapa Tour: ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లా పర్యటన కన్ఫామ్‌ అయింది. పర్యటన వివరాలను కలెక్టర్ విజయరామరాజు మంగళవారం వెల్లడించారు. సీఎం జగన్ డిసెంబర్ 2, 3వ తేదీల్లో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. డిసెంబర్ రెండో తేదీ ఉదయం ముఖ్యమంత్రి జగన్.. తన నివాసం నుంచి 1.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.15 గంటలకు స్థానిక నేతలతో మాట్లాడతారు. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు.

వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ ను ప్రారంభించనున్న సీఎం జగన్..

మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ బోటింగ్ జెట్టీని ప్రారంభిస్తారు. 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్ కు బయలు దేరుతారు. 12.40 గంటలకు అక్కడకు చేరుకొని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అంటే నాలుగు గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలకు హెలికాప్టర్ లో ఇడుపులపాయ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఓ పది నిమిషాల పాటు స్థానిక నేతలతో మాట్లాడి.. 5.20 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్ హౌజ్ చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. 

డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 8.40 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి కదిరి రోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్ కు చేరుకుంటారు. అక్కడ 9.15 నుంచి 9.30 వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. 9.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం 9.45 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 10.10 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.

నేడు మదనపల్లెకు సీఎం జగన్..

ఏపీ సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా నాలుగో విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే ఓ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ నిధులు విడదల చేయబోతున్నారు. 2022వ సంవత్సరానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను జగన్‌ మదనపల్లెలో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, ముస్లిం, కాపు, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Pak Toss Update: టీమిండియా బౌలింగ్.. పాక్ తో కీలక మ్యాచ్.. గెలిస్తే దాదాపు సెమీస్ కు.. పాక్ కు చావోరేవో
టీమిండియా బౌలింగ్.. పాక్ తో కీలక మ్యాచ్.. గెలిస్తే దాదాపు సెమీస్ కు.. పాక్ కు చావోరేవో
SLBC Tunnel Rescue operation: టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
SLBC టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
Mazaka Trailer: ‘బాలయ్య బాబు ప్రసాదం.. చాలా ఫన్ ఉంది’.. సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉందంటే?
‘బాలయ్య బాబు ప్రసాదం.. చాలా ఫన్ ఉంది’.. సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉందంటే?
Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Pak Champions Trophy 2025 | కింగ్ విరాట్ కొహ్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడా | ABP DesamInd vs Pak Head to Head Records | Champions Trophy 2025 భారత్ వర్సెస్ పాక్...పూనకాలు లోడింగ్ | ABPSLBC Tunnel Incident Rescue | ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో మొదలైన రెస్క్యూ ఆపరేషన్ | ABP డిసంAPPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Pak Toss Update: టీమిండియా బౌలింగ్.. పాక్ తో కీలక మ్యాచ్.. గెలిస్తే దాదాపు సెమీస్ కు.. పాక్ కు చావోరేవో
టీమిండియా బౌలింగ్.. పాక్ తో కీలక మ్యాచ్.. గెలిస్తే దాదాపు సెమీస్ కు.. పాక్ కు చావోరేవో
SLBC Tunnel Rescue operation: టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
SLBC టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
Mazaka Trailer: ‘బాలయ్య బాబు ప్రసాదం.. చాలా ఫన్ ఉంది’.. సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉందంటే?
‘బాలయ్య బాబు ప్రసాదం.. చాలా ఫన్ ఉంది’.. సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉందంటే?
Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
Shivoham: నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు..చిదానందరూపాన్ని శివుడిని!
నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు..చిదానందరూపాన్ని శివుడిని!
How To Live Longer: మరణాన్ని జయించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ మాటల్లోనే..
మరణాన్ని జయించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ మాటల్లోనే..
Ajith Car Crash: రేస్ ట్రాక్‌లో మళ్ళీ క్రాష్... నెలలో రెండోసారి అజిత్‌ కారుకు యాక్సిడెంట్
రేస్ ట్రాక్‌లో మళ్ళీ క్రాష్... నెలలో రెండోసారి అజిత్‌ కారుకు యాక్సిడెంట్
Kohli Records: ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు
ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు
Embed widget