AP News: బటన్ నొక్కి కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
AP News: పేదింటి ఆడపడుచుల కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఏపీ సీఎం జగన్ బటన్ నొక్కి మరీ నిధులు విడుదల చేశారు.
AP News: పేదింటి ఆడ పడుచుల పెళ్లి కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్ నేడు నిధులు విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్ నొక్కి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జనవరి - మార్చి త్రైమాసికంలో వివాహాలకు చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింది రూ. 87.32 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు.
చంద్రబాబు హయాంలో కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు ఇస్తే.. ఇప్పుడు మనం లక్ష రూపాయలు ఇస్తున్నాం. గతంలో మాదిరిగా ఎన్నికల కోసం కాకుండా చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం.
— YSR Congress Party (@YSRCParty) May 5, 2023
- సీఎం వైయస్ జగన్#YSRKalyanaMasthu #YSRShaadiTohfa pic.twitter.com/B7LYlwjzJy
వివాహాల చేస్తున్న పేదలకు అండగా నిలుస్తున్నాం..
వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద పేదింటి ఆడపిల్లలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. పదో తరగతి చదవుకున్న వారికే కళ్యాణమస్తు, షాదీ తోఫాలు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామని అన్నారు. దీనివల్ల ఆడ పిల్లలను పదో తరగతి వరకూ చదివించాలన్న తపన ప్రతి పేద కుటుంబంలో కూడా మొదలవుతుందన్నారు. ఆడ పిల్లకు 18 ఏళ్లు ఉండాలి, అబ్బాయికి కచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన పెట్టినట్లు గుర్తు చేశారు. పదో తరగతి అయ్యేసరికి అమ్మాయికి 15 ఏళ్లు నిండుతుందని, ఆతర్వాత వివాహం కోసం మరో మూడేళ్లు ఆగాల్సి వస్తుందిని అన్నారు. అందువల్ల నేరుగా ఇంటర్మీయడిట్‌కు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎలాగూ ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన కూడా అందిస్తున్నాం కాబట్టి పిల్లలు డిగ్రీ వరకూ చదువుకునే అవకాం ఉంటుందన్నారు.
జగనన్న అమ్మఒడి మొదటి ప్రోత్సాహకంగా నిలిస్తే, రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుందని సీఎం జగన్ వివరించారు. అలాగే ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుందన్నారు. పేదరికం పోవాలంటే ఒకే ఒక్క మార్గం చదువులు మాత్రమేనని అన్నారు. చదువులు ఉంటేనే.. మెరుగైన ఉద్యోగాలు వస్తాయన్నారు. అప్పుడే పేదరికం నుంచి అన్ని కుటుంబాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇవాళ లబ్ధిదారులైన వారిలో దాదాపు 6వేల జంటలు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఎన్నికల కోసం చేశామంటే.. చేశాం అన్నట్టుగా చేసిందని ఆరోపించారు. మొత్తం లక్షా 7 వేల 709 మంది జంటలకు డబ్బులు ఎగరగొట్టిందన్నారు.
దాదాపు రూ.70 కోట్లు పేద ప్రజలను ఇవ్వకుండా చేతులు దులుపేసుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీసీ సోదరులకు మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీలకు గతంలో 40 వేలు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదన్నారు. వైసీపీ సర్కారు ఎస్సీలకు లక్ష రూపాయలు అందిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు గతంలో రూ. 50వేల రూపాయలు ఇస్తామని చెప్పారని.. ఈ డబ్బుకూడా ఇవ్వలేదని విమర్శించారు. కానీ జగన్ సర్కారు దానిని లక్ష రూపాయలకు పెంచిదని అన్నారు. బీసీలకు గతంలో రూ.35వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారని.. వైసీపీ సర్కారు రూ.50వేలకు పెంచిందని గుర్తు చేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకైతే లక్షన్నర వరకూ పెంచామన్నారు. ఇలా ప్రతి కేటగిరీలో కూడా ఇచ్చే డబ్బును పెంచామని చెప్పారు.