అన్వేషించండి

Ramaseshu Murder Case: వైసీపీ లీడర్‌ రామశేషు హత్యపై రకరకాల స్టోరీలు- నిందితులను వెతికే పనిలో పోలీసులు

Ramaseshu Murder Case: సిక్కోలు రామషేషు హత్యపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో అంత్యక్రియల్లో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. కన్నీటితో వీడ్కోలు పలికారు. 

Ramaseshu Murder Case: శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షుడు బరాటం రామశేషు మంగళవారం హత్యకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆ కుటుంబానికి అండగా నిలవాలని  తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు సూచించారు. దీంతో విజయవాడలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీసీ సదస్సుకు ఆయన హాజరు కాకుండా.. పార్టీకి ఎన్నో సేవలందించి హత్యకు గురైన రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకూర్మం వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు.


Ramaseshu Murder Case: వైసీపీ లీడర్‌ రామశేషు హత్యపై రకరకాల స్టోరీలు- నిందితులను వెతికే పనిలో పోలీసులు

రామశేషు పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టిన ధర్మాన..

దారుణ హత్యకి గురైన గార మండల వైస్ ఎంపీపీ బరాటం రామశేషు అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడుతోపాటు వైసీపీ నేతలు, మండలవాసులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. రామశేషు హత్యానంతరం శ్రీకూర్మంలో విషాదం నెలకొంది. అంత్యక్రియల వరకు ఎవరినోట మాట రాని పరిస్థితి ఏర్పడింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు రామశేషు పార్థివ దేహాన్ని చూసి తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తండ్రి బరాటం నాగేశ్వరరావుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత రామశేషుకు కన్నీటి వీడ్కోలు పలికారు.


Ramaseshu Murder Case: వైసీపీ లీడర్‌ రామశేషు హత్యపై రకరకాల స్టోరీలు- నిందితులను వెతికే పనిలో పోలీసులు

ప్రజల మనిషిని దుర్మార్గంగా, పైశాచికంగా గొంతుకోసి చంపితే ఎవరూ నోరు మెదపకపోవడం దారుణం అన్నారు ధర్మాన. హంతకులను పట్టుకుంటామని శిక్ష పడేలా చేస్తామన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటామన్నారు. పోలీసులు తమ సామర్థ్యాన్ని అంతా వినియోగించి హత్య చేసి తప్పించుకున్న వారిని అదుపులోకి తీసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. 

మొదటిసారి హత్యాయత్నంతోనే కథ ముగిసిందనుకున్నారు..

2017లో రామశేషుపై జరిగిన హత్యా ప్రయత్నం విఫలం కావడంతో అక్కడితో కథ ముగిసిపోయిందనుకున్నారు. కానీ అదే మర్డర్ ప్లాన్ ను తిరిగి 2022లో ఎందుకు అమలు చేయాల్సివచ్చిందన్న విషయాన్ని శోధిస్తున్నారు పోలీసులు.  రామశేషును హతమార్చడానికి రెక్కీ నిర్వహించిన కొంతమంది అగంతకులను అక్కడ జనం చూశారని టాక్. అయినా ఎవరి దగ్గర కూడా నోరు విప్పడం లేదు. శ్రీకూర్మంలో కళింగ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారి పెద్దరికాన్ని అంగీకరించని ఇతర సామాజిక వర్గాల్లో కొందరు ఈ పని చేసి ఉంటారన్న అనుమానం కొందరిలో ఉంది. 


Ramaseshu Murder Case: వైసీపీ లీడర్‌ రామశేషు హత్యపై రకరకాల స్టోరీలు- నిందితులను వెతికే పనిలో పోలీసులు

బుడ్డయ్యగారిపేట, శ్రీకూర్మం బస్టాండ్ భూమి వ్యవహారంతోపాటు శ్రీకాకుళం నగర పరిధిలో గల పెద్దపాడు భూ వ్యవహారంలో కోట్ల లావాదేవీలు, శ్రీకాకుళం నగరానికి చెందిన ఒక వైశ్య నేత జీడి పరిశ్రమ వ్యవహారంతో పాటు మరెన్నో భూ లావాదేవీలను బరాటం నాగరాజు ఇంట్లో జరిగేవని తెలుస్తోంది. సెటిల్మెంట్లు, దందాలు వెరసి చాలా పొరపాట్లు రామశేషు ప్రాణాలు తీశాయన్నది మరో కోణం వినిపిస్తోంది. ఇందులో కొంత మందిని విచారణ చేసిన జిల్లా పోలీసు అధికారులు అలిపి గోదావరి, కైబాటి రాజుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీరిద్దరూ అర్చకులు రొక్కంబాబు భూతగాదాల్లో ఉండడమే కారణంగా తెలుస్తోంది. రామశేషు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులకు ముందుగానే మర్డర్ ప్లాన్, సుపారీ టీం రెక్కీ వంటి విషయాలు తెలిసి ఉంటుందన్న అనుమానాలు కూడా పోలీసులను వెంటాడుతున్నాయి. రెక్కీ నిర్వహించడానికి, హత్యకు పరోక్షంగా శ్రీకాకుళం, శ్రీకూర్మం ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యక్తులు సహాయ సహకారాలు అందించి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.  

నాడు, నేడు గొంతకోసే.. 

2017 రామశేషుపై హత్యా యత్నం జరిగినప్పుడు కూడా గొంతే కోశారు. కానీ, ఆయువు ఆగిపోలేదు. మృత్యువుతో పోరాడి బతికి బయటపడిన రామశేషు రాజకీయంగా అధికార పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అలా ఎదిగిన క్రమంలో చేసిన పొరపాట్లు కూడా ప్రాణం తీశాయని చెబుతున్నారు. తండేలవలసకు చెందిన ఒక మహిళతో ఉన్న అక్రమ సంబంధమే 2017 రామశేషు గొంతు కోసేంత వరకూ తీసుకువెళ్లిందని అప్పట్లో టాక్ నడిచింది. ఆ హత్య కేసులో రామశేషుయే స్వయంగా వెనక్కి తగ్గడంతో నిజాలు బయటకు రాలేదు. ఇప్పుడు అదే మాదిరిగా గొంతుకోసే రామశేషును హతమార్చారు. ఇదంతా చూస్తుంటే 2017, 2022 కేసులకు పోలికలు ఉన్నాయంటున్నారు స్థానికులు. 

ఇది మరో కోణం.. 

శ్రీకూర్మం పంచాయితీలో గల సీమెన్స్ కుటుంబాల్లో మహిళలు రామశేషును నమ్మి లక్షల రూపాయలు ఇచ్చారని, వాటిని తిరిగి ఇవ్వాలని పలుమార్లు ప్రాధేయపడుతున్నా వెనక్కి ఇవ్వకపోవడం వల్లే ఈ హత్య జరిగిందని మరో ఆరోపణ ఉంది. ఎంతగా డబ్బులు అడుగుతున్నా.. 'రియల్ ఎస్టేట్' వ్యాపారంలో పెట్టుబడి పెట్టానని, ఇచ్చేస్తానంటూ చెప్పుకువచ్చే వారని ఆ గ్రామంలో కొందరు చెబుతున్నారు. ఇలా ఎన్నో కారణాలుగా రామశేషు హత్యకు ఉన్నాయన్నది ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న జిల్లా పోలీసుశాఖ హత్య జరిగిన కొద్ది గంటల్లోనే అగంతకుల జాడను వెంటాడుతున్నామని చెప్పిన సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ముగ్గురు హత్య చేసేందుకు వచ్చారని వారిలో ఒకరిని గుర్తించినట్టు ఫుటేజీ ద్వారా పోలీసులు చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget