![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Andhra News: 'మన టార్గెట్ 175 స్థానాలు' - నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం, పులివెందులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని సీఎం జగన్ పులివెందుల నేతలకు దిశానిర్దేశం చేశారు. కడప జిల్లాలో పర్యటన సందర్భంగా పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
![Andhra News: 'మన టార్గెట్ 175 స్థానాలు' - నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం, పులివెందులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ap cm jagan election dierections to pulivendula ysrcp leaders and inaguarated development programs Andhra News: 'మన టార్గెట్ 175 స్థానాలు' - నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం, పులివెందులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/e38e3b777cade04b77ebc847447b4d4b1703424608885876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Jagan Election Dierections to Pulivendula Ycp Leaders: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచేలా కృషి చేయాలని సీఎం జగన్ పులివెందుల పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేసిన ఆయన, నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా పర్యటించి, ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్సార్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ప్రార్థనా మందిరానికి చేరుకుని క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అభివృద్ధికి నిదర్శనం
కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ రెండో రోజు (ఆదివారం) పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సింహాద్రిపురంలో నూతనంగా నిర్మించిన రోడ్డు వెడల్పు సుందరీకరణ పనులు, వైఎస్సార్ పార్కు, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయాలను ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. కాగా, సింహాద్రిపురం మండల కేంద్రంలో రూ.11.6 కోట్లతో రోడ్ల సుందరీకరణ, రూ.5.5 కోట్లతో 1.5 ఎకరాల్లో వైఎస్సార్ పార్కును సుందరీకరించారు. ఇందులో ఎంట్రీలో ప్లాజా వాటర్ ఫౌండేషన్, చిన్న పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వైఎస్సార్ విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. రూ.3.19 కోట్ల PADA నిధులతో నిర్మించిన తహసీల్దార్ ఆఫీస్, రూ.2 కోట్లతో న్యూ పోలీస్ స్టేషన్, రూ.3.16 కోట్లతో నిర్మించిన ఎంపీడీవో ఆఫీసును సీఎం ప్రారంభించారు.
Also Read: Kodali Nani: ఎంత మంది పీకేలను పెట్టుకున్నా జగన్‌ను ఏం పీకలేరు - కొడాలి నాని సెటైర్లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)