Somu Veerraju Jala Poru Yatra: ఉత్తరాంధ్రపై బీజేపీ ఫోకస్ - ఈ నెల 7, 8, 9న సోము వీర్రాజు జల పోరు యాత్ర
AP BJP Chief Somu Veerraju Jala Poru Yatra: ఉత్తరాంధ్ర జిల్లాల్లో అసంపూర్ణంగా నిలిచిపోయిన తాగు-సాగు నీటి ప్రాజెకులపై పోరుబాట చేపడతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
Somu Veerraju Jala Poru Yatra: పాలకులు ఉత్తరాంధ్ర జిల్లాలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఈ ప్రాంతాలలో డెవలప్‌మెంట్ కోసం బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. ఏపీలో వెనుకబడిన ప్రాంతాల్లో నీటి సౌకర్యాల కోసం పోరుబాటకు దిగి, అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అసంపూర్ణంగా నిలిచిపోయిన తాగు-సాగు నీటి ప్రాజెకులపై పోరుబాట చేపడతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. "ఉత్తరాంధ్ర జలం కోసం - జల పోరు యాత్ర" నిర్వహించనున్నట్లు సోము వీర్రాజు పేర్కొన్నారు.
"ఉత్తరాంధ్ర జలం కోసం - జల పోరు యాత్ర"
కుటుంబ పార్టీల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ నెల 7,8,9 తేదీలలో బీజేపీ నేతలు యాత్ర నిర్వహించనున్నారు. తమ పోర్టీ చేపట్టనున్న ఈ పోరు బాటకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నాయకత్వం వహించనున్నారు. ఈ యాత్రను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించనున్నారు. యాత్రలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, నిమ్మక జయరాజు, రాష్ట్ర పార్టీ పదాధికారులు, మోర్చాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు.
ఈ యాత్రలో బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ పీవీయన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావులు పాల్గొనుండగా.. ఉత్తరాంధ్ర జలం కోసం - జల పోరు యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ పాల్గొంటారని సమాచారం.
బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీలో బీజేపీ పుంజుకుంటుందని పంచాగంలో ఉందన్నారు సోము వీర్రాజు. శ్రీశైలంలో భక్తులకు సదుపాయాలు కల్పించడం లేడని, త్వరలోనే అక్కడ పర్యటించి అన్ని విషయాలు పరిశీలిస్తామన్నారు. గుంటూరులో కొన్ని రోజుల కిందట వివాదాస్పదంగా మారిన జిన్నా టవర్ పేరు మార్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువ మోర్చా ఆందోళన కొనసాగిస్తుందని చెప్పారు.
Also Read: Ugadi 2022: ఉగాది వేడుకల్లో సతీసమేతంగా ఏపీ సీఎం జగన్ - ఈ ఏడాది ఏపీలో ఎలా ఉంటుందో తెలుసా !
Also Read: AP Govt Affidavit In HC: అమరావతి రాజధానిపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ - పేర్కొన్న అంశాలివే