AP Govt Affidavit In HC: అమరావతి రాజధానిపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ - పేర్కొన్న అంశాలివే
AP CS files affidavit in HC: నెల రోజుల్లోగా ఏపీ ప్రభుత్వం సమాధానం (అఫిడవిట్ దాఖలు చేయాలని) చెప్పాలని హైకోర్టు స్పష్టం చేయడంతో ఏపీ సీఎస్ సమీర్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు.
AP Government files Affidavit In High Court: అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఏపీ హైకోర్టు మార్చి 3న రాజధాని కేసులో తీర్పిచ్చింది. దీనిపై నెల రోజుల్లోగా ఏపీ ప్రభుత్వం సమాధానం (అఫిడవిట్ దాఖలు చేయాలని) చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో గడువు ముగుస్తుందనగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ రాష్ట్ర హైకోర్టులో రాజధాని అమరావతి అంశంపై అఫిడవిట్ దాఖలు చేశారు. మొత్తంగా 190 పేజీల అఫిడవిట్‌ను ఏపీ హైకోర్టుకు ఆయన సమర్పించారు.
ఏప్రిల్ 3వ తేదీలోగా రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు వారి ప్లాట్లలో పనులు పూర్తి చేసి తుది నివేదిక సమర్పించాలని నెల రోజుల గడువు ఇస్తూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీఆర్డీఏ చట్టం (CRDA Act)లో పనులు పూర్తి చేయడానికి మరో నాలుగేళ్లు పొడిగించామని ఏపీ ప్రభుత్వం తమ అఫిడఫిట్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2024 జనవరి వరకు అందుకు తుది గడువు ఉందని ఏపీ హైకోర్టుకు తెలిపారు. కానీ రాజధాని అభివృద్ధిని ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని, పలు విషయాలు అఫిడవిట్‌లో సరిగ్గా పేర్కొనలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్తుందని, కానీ అక్కడ సైతం ఏపీ సర్కార్ కు చుక్కెదురు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
పార్టీ పరంగా బలంగా మూడు రాజధానుల వాదన !
వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) తరపున బలంగా మూడు రాజధానుల వాదన వినిపిస్తున్నారు. తమ పార్టీ విధానం మూడు రాజధానులని ( Three Capitals ) మరో మాట లేకుండా చెబుతున్నారు. అమరావతి విషయంలో కోర్టు తీర్పుపై నేరుగా ఎలాంటి కామెంట్లు చేయనప్పటికీ చట్టం చేయకుండా నిలువరించడాన్ని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో తమ విధానం మూడు రాజధానులని.. చేసి తీరుతామని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. రాజకీయ పరంగా చాలా దూకుడుగా తమ వికేంద్రీకరణ వాదం వినిపిస్తున్నారు. వాస్తవానికి రాజకీయంగా ప్రకటనలకు తప్ప మూడు రాజధానులు అనేది సాధ్యం కాదని హైకోర్టు ఆదేశాలతో తేలిపోయింది. మరి మూడు రాజధానులు ఎలా ఏర్పాటు చేస్తారన్నది ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. కానీ ప్రభుత్వానికీ ఆ విషయంలో క్లారిటీ ఉందని ఎవరూ అనుకోవడం లేదు. కేవలం రాజకీయం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
చట్టం చేసే హక్కు లేదన్న హైకోర్టు తీర్పుపై ఘాటు వ్యాఖ్యలు !
అమరావతి ( Amaravati ) విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసిందని.. ఇప్పుడా చట్టానికి భిన్నంగా మూడు రాజధానుల చట్టం చేసే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పింది. అయితే చట్టం చేసే హక్కు లేదని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్ఆర్‌సీపీ నేతలు.. మంత్రులు ( Ministers ) కాస్త ఘాటు స్వరంతోనే స్పందించారు. అసెంబ్లీ ఉన్నది చట్టాలు చేయడానికేనని.. ప్రజలు తమను ఎన్నుకున్నది చట్టాలు చేయడానికేనని.. ఆ పని చేయవద్దని అంటే ఎట్లా అని ప్రశ్నించడం ప్రారంభించారు. హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు వంటి వారు నేరుగా హైకోర్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మంత్రి బొత్స లాంటి వాళ్లు మరింత తీవ్రమైన విమర్శలు చేశారు.
Also Read: Summer Specail Trains : ఉగాది, వేసవి రద్దీ దృష్ట్యా 72 ప్రత్యేక రైళ్లు, ఈ రూట్లలోనే?