Ants build bridge: పారుతున్న నీటి మీద బ్రిడ్జి కట్టేసిన చీమలు - వాటి తెలివి ముందు మనుషులెంత ? - వీడియో
Viral News: చీమలు గురించి చాలా గొప్పగా చెబుతాం. కానీ అందరం లైట్ తీసుకుంటాం. చీమలు ఎంత తెలివిగలవో ఓ సారి ఈ వీడియో చూడండి.

Ants build a living bridge over water: చీమ అతి చిన్న జీవి.కానీ ఆ జీమ గురించి మనకు ఎన్నో స్ఫూర్తి కథలు అందుబాటులో ఉన్నాయి. ఓ ఆనకొండను అయినా చీమలు చంపేస్తాయని తెలుసుకున్నాం. వాటి క్రమశిక్షణ గురించి కార్పొరేట్ పాఠాల్లో కూడా చెబుతారు. వాటి శ్రామిక శక్తి.. కష్టపడే తత్వం గురించి ఎన్నెన్ని పాఠాలు విన్నామో చెప్పాల్సిన పనిలేదు. అలాగే టీం స్పిరిట్ ను మనుషులు చీమల నుంచి నేర్చుకోవాలని చెబుతూంటారు. ఇవి మాత్రమే కాదు .. చీమలు మనుషుల కంటే అద్భుతమైన ఇంజనీర్లు అని నిరూపిస్తున్నాయి. దానికి ఉదాహరణ ఈ వీడియో.
Ants build a bridge to cross water. pic.twitter.com/yvNcdPHJ08
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) December 29, 2024
పారే నదిపై ఎవరైనా వంతెన కట్టగలరా ?. నదిలో పిల్లర్లు వేసి వాటిపై కడతారు కానీ.. పారుతున్న నీటి మీద వంతెన కట్టడం అనేది మనుషులు ఇంత వరకూ చేయలేకపోయారు. కానీ చీమలు చేసి చూపించాయి. పారుతున్న చిన్న కాలువను దాటానికి అవి ఓ వంతెన నిర్మించుకున్నాయి. వాటి మీదనే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టు చేశాడు. దాన్ని మీరే చూడండి.
By linking together, ants can cross vast spaces.
— Potato (@MrLaalpotato) December 29, 2024
This bridge helped them storm a wasp nestpic.twitter.com/mtTfTKOT1V
Ant communication is more effective than humans! pic.twitter.com/bdL7BLzMRL
— Crazy Moments (@Crazymoments01) December 29, 2024
ఈ చీమలు తయారు చేసిన పారుతున్న నీటి మీద వంతెన కాన్సెప్ట్ ను అధ్యయనం చేసి నదుల మీద..సముద్రాల మీద నిర్మిస్తే..షిప్పుల వాడకం తగ్గిపోయిన.. నదులమీద వాహనాలతో దూసుకు పోవచ్చని అంటున్నారు.
Ants work together as a team to build a bridge and carry their larvae to a dry and safe place. pic.twitter.com/PQv7Snl8s7
— Silent Kuri (@Silent_Kurri) December 29, 2024





















