అన్వేషించండి

K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!

Annamalai quit BJP news: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? జూన్ 3న ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ దీనికి సమాధానం ఇవ్వబోతోంది.

Anamalai press conference June 3: మిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ముఖచిత్రం ఆవిష్కృతం కాబోతోందా? సింగం ఐపీఎస్ ఆఫీసర్‌గా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత కమలం గూటికి చేరి ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కే. అన్నామలై బీజేపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఢిల్లీ పెద్దల నిర్ణయాలతో విభేదిస్తూ, ఆయన సొంతంగా కొత్త రాజకీయ పార్టీ లేదా సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 3వ తేదీన ఆయన చెన్నైలో ఒక  ప్రెస్ మీట్ పెట్టి, తన భవిష్యత్తు కార్యాచరణను అధికారికంగా ప్రకటించబోతున్నారని తమిళ పాలిటిక్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అన్నామలై మద్దతుదారులు ఆయన స్థాపించబోయే కొత్త పార్టీ పేరు, జెండా డిజైన్లను కూడా వైరల్ చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా సాగే హైకమాండ్ రాజకీయాలకు స్వస్తి చెప్పి, తమిళనాడు మట్టి వాసన తెలిసిన ఒక ప్రాంతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నదే అన్నామలై ప్లాన్‌గా కనిపిస్తోంది.

హిందీ విధింపుపై తిరుగుబాటే తొలి అడుగు? 

కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో అన్నామలైకి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రాన్ని  హడావుడిగా అమలు చేయాలని చూడాన్ని అన్నామలై బహిరంగంగానే వ్యతిరేకించారు. తమిళనాడు సెంటిమెంట్‌కు అత్యంత సున్నితమైన  భాషా వివాదం  విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారని ఆయన  ఎక్స్  వేదికగా తప్పుబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఇలా తిరుగుబావుటా ఎగరేయడం, ఢిల్లీ పెద్దలకు ఆయన పంపుతున్న బలమైన పొలిటికల్ సిగ్నల్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.   

 ఏఐఏడీఎంకే  కూటమిపై అసంతృప్తి 

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో మళ్ళీ పొత్తు పెట్టుకోవాలనే ఢిల్లీ బీజేపీ పెద్దల నిర్ణయం అన్నామలైకి అస్సలు నచ్చలేదు. గతంలో జయలలిత, అన్నాదురైలపై అన్నామలై చేసిన ఘాటు వ్యాఖ్యల వల్లే కూటమి విచ్ఛిన్నమైందని, పొత్తు కుదరాలంటే అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఎడప్పాడి పళనిస్వామి  కండిషన్ పెట్టారు. దాంతో హైకమాండ్ ఆయనను తప్పించి నైనార్ నాగేంద్రన్‌ను అధ్యక్షుడిగా నియమించింది. పార్టీ లైన్ దాటకుండా అన్నామలై అప్పట్లో కూటమి తరఫున ప్రచారం చేసినప్పటికీ.. ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ వైఫల్యం తర్వాత, ఢిల్లీ పెద్దల చేతుల్లో కీలుబొమ్మగా మారడం కంటే బయటకు రావడమే బెటర్ అని ఆయన డిసైడ్ అయినట్లు టాక్.

 విజయ్  టీవీకే  ప్రభావాన్ని తట్టుకునేందుకేనా? 

తమిళనాడులో ప్రస్తుతం ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు తోడు నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం అధికారంలోకి వచ్చి సరికొత్త రాజకీయ శకాన్ని ప్రారంభించింది. యువత అంతా విజయ్ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో, తాను కూడా ఒక స్వతంత్ర ప్రాంతీయ శక్తేనని నిరూపించుకోకపోతే తమిళ రాజకీయాల్లో వెనుకబడిపోతామని అన్నామలై భావిస్తున్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర ఇన్-ఛార్జ్ నితిన్ నబిన్‌తో అత్యవసర సమావేశాన్ని కోరినట్లు సమాచారం. ఈ చర్చలు విఫలమైతే, జూన్ 3న ఆయన పార్టీ వీడటం ఖాయమని తమిళ పత్రికలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి..

 
మరోవైపు, తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకులు ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. అన్నామలై పార్టీ వీడటం లేదని, ఆయనకు జాతీయ స్థాయిలో ఒక కీలకమైన బాధ్యతను అప్పగించేందుకు అధిష్టానం ఆలోచిస్తోందని చెబుతున్నారు. ఒకవేళ అన్నామలై నిజంగానే సొంత పార్టీ పెడితే, అది తమిళనాడులో కాస్తో కూస్తో పుంజుకుంటున్న బీజేపీ ఓటు బ్యాంకును ఘోరంగా దెబ్బతీస్తుంది. ఏది ఏమైనా, మాజీ ఐపీఎస్ అధికారి తీసుకోబోయే ఈ తదుపరి అడుగు ఈ వారంలో తమిళనాడు రాజకీయాల్లో ఒక పెను భూకంపం సృష్టించబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilbad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Embed widget