అన్వేషించండి

Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?

తమిళరాజకీయాల్లో చర్చనీయాంశమైన అన్నామలై కొత్త పార్టీకి ఇప్పుడు మరో కోణం తోడైంది. తమిళ సూపర్ స్ఠార్ రజినీ కాంత్ సాయం ఆయన తీసుకోబోతున్నారు అనే చర్చ తమిళనాడంతా చక్కర్లు కొడుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అన్నామలై 'మక్కల్ శక్తి ఇయక్కం' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారా?
  • రజనీకాంత్ మద్దతుతో అన్నామలై రాజకీయ ప్రయాణం కొనసాగే అవకాశం ఉంది.
  • బీజేపీతో విభేదాల నేపథ్యంలో అన్నామలై ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
  • అన్నామలై, విజయ్ మధ్య యువతను ఆకర్షించే కొత్త తరం పోరాటం మొదలయ్యేనా?
  •  బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా అన్నామలై?
  • మక్కల్ శక్తి ఇయక్కం" పేరులోనే దాగి ఉన్న రజనీ ముద్ర?
  • ఢిల్లీ పర్యటన వీడ్కోలు భేటీనా.. కీలక చర్చలా?
  • విజయ్ వర్సెస్ అన్నామలై.. తమిళ రాజకీయాల్లో కొత్త తరం పోరాటానికి నాంది?
  • వచ్చే 48 గంటల్లో తమిళనాడు రాజకీయాల్లో భారీ ట్విస్ట్‌కు అవకాశం!

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామాలకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత కె. అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఇప్పుడు చర్చ అంతా ఆయన కొత్త పార్టీ పెడతారా లేదా అన్న దానిపై కాదు... ఆ కొత్త ప్రయాణం వెనుక సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు ఉన్నాయా? అనే అంశంపైనే సాగుతోంది.

అన్నామలై ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న "మక్కల్ శక్తి ఇయక్కం" అనే పేరే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఈ పేరు, ఈ భావజాలం, ఈ రాజకీయ సందేశం... అన్నీ ఒకప్పుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశం సమయంలో వినిపించిన మాటలను గుర్తు చేస్తున్నాయి. ఒక దశలో తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తారని భావించిన రజనీకాంత్ చివరి క్షణంలో రాజకీయ రంగప్రవేశాన్ని విరమించుకున్నారు. పైగా తాజా ఎన్నికల్లో విజయ్ సీఎం పదవి దక్కించుకున్న తర్వాత రజనీ ఆయన్నుకాకుండా ప్రతిరక్ష స్టాలిన్ ను కలవడం, నేను రాజకీయాల్లోకి వచ్చుంటే ఖచ్చితంగా సీఎం అయ్యేవడినని చెప్పడం లాంటి మాటల్లో రజనీకి ఎక్కడో విజయ్ సిఎం కావడం పట్ల అయిష్టత  ఉందనే చర్చ తమిళనాడులో వినిపిస్తోంది. 

అన్నామలై ఢిల్లీ పర్యటన అందుకేనా?

ఈ నేపథ్యంలో అన్నామలై ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసేందుకు వెళ్లారు. అధికారికంగా పూర్తి వివరాలు ఇవ్వకపోయినా, రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిని మరో కోణంలో చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలైని బీజేపీ పూర్తిగా పక్కకు పెట్టేయడం పట్ల ఆయన అసంతృప్తిగా వున్నారు. తనను పట్టించుకోని పార్టీ లో ఉండాలో లేదో ఢిల్లీ నేతలతోనే తెల్చుకుని తన దారి తాను వెతుక్కుంటానన్న ధోరణిలో ఆయనున్నారు. 

జూన్ 1న మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అన్నామలై స్పందించిన తీరు ఈ ఊహలకు మరింత ఊతమిస్తోంది. ఇంకో రెండు రోజులు వేచి చూడండి... అన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం అని ఆయన చెప్పడం సాధారణ వ్యాఖ్యలా కనిపించలేదు.పార్టీలో తన భవిష్యత్తుపై స్పష్టత కోరుతున్న నాయకుడి మాటల కంటే, ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నాయకుడి సంకేతాల్లా అవి వినిపించాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బీజేపీలో అన్నామలైకి పొసిగే అవకాశాలు లేవా..?

తమిళనాడులో బీజేపీ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోవడం, అన్నాడీఎంకేతో పొత్తుల వ్యవహారంలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, రాష్ట్ర రాజకీయాల్లో తనకు కావాల్సిన స్వేచ్ఛ లభించడం లేదనే అసంతృప్తి... ఇవన్నీ అన్నామలై మరియు బీజేపీ మధ్య గ్యాప్‌ను పెంచిన అంశాలుగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఢిల్లీ పర్యటన చర్చల కోసం కాదు వీడ్కోలు కోసం కావచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

పార్టీ కాదు... ప్రజా ఉద్యమంగా మొదలు!

అన్నామలై  సమాలోచనలు చేస్తున్న "మక్కల్ శక్తి ఇయక్కం" స్ధాపన తక్షణ రాజకీయ పార్టీ కాదని తెలుస్తోంది. ముందుగా ప్రజల్లో బలమైన నెట్‌వర్క్ నిర్మించడం, యువ నాయకత్వాన్ని తయారు చేయడం, అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం, అభివృద్ధి రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి లక్ష్యాలతో ప్రజా ఉద్యమంగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రజనీకాంత్ పేరెందుకు వినిపిస్తోంది?

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికర అంశం మాత్రం రజనీకాంత్ పేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా, తమిళ సమాజంలో రజనీ ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు. ఆయన బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా, కనీసం మౌన సమ్మతి ఉందనే సంకేతం బయటకు వస్తే అది అన్నామలైకి  బలాన్ని అందించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ కూటములు ఇవ్వలేని భావోద్వేగ అనుబంధాన్ని ఒక్క రజనీకాంత్ పేరు సృష్టించగలదనే విషయం అన్నామలైకి బాగా తెలుసని చెబుతున్నారు.

విజయ్ వర్సెస్ అన్నామలై... జెన్ జీ యువత టార్గెట్..??

ఒకవైపు రాజకీయ రంగంలో అడుగుపెట్టిన సినీ హీరో విజయ్. మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై. సాంప్రదాయ డీఎంకే-అన్నాడీఎంకే రాజకీయాలకు ప్రత్యామ్నాయం కోరుతున్న యువ ఓటర్లను ఆకర్షించే సామర్థ్యం ఇద్దరికీ ఉంది. ఒకరు వెండితెర నుంచి వస్తే... మరొకరు IPS బ్యాగ్రౌండ్ తో  వచ్చారు. ఇద్దరి మధ్య పోటీ తమిళనాడులో కొత్త తరం రాజకీయాలకు నాంది కావచ్చని అంచనా.
 

అన్నామలై ముందు సవాళ్లు చాలానే ఉన్నాయి. బలమైన సంస్థాగత వ్యవస్థ లేదు. ఎన్నికల కూటములు లేవు. స్పష్టమైన ఎన్నికల రోడ్‌మ్యాప్ కూడా ఇంకా కనిపించడం లేదు. అయితే అధిక రిస్క్ ఉన్న పరిస్థితులను అవకాశాలుగా మలచడంలో అన్నామలై ఇప్పటివరకు ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ పర్యటనపైనే ఉంది. వచ్చే 48 గంటల్లో జరిగే పరిణామాలు కేవలం అన్నామలై రాజకీయ భవిష్యత్తునే కాదు... రాబోయే దశాబ్దం పాటు తమిళనాడు రాజకీయాల దిశను కూడా నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Frequently Asked Questions

అన్నామలై కొత్త పార్టీ పెడతారా?

అన్నామలై కొత్త పార్టీ పెట్టే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అతను 'మక్కల్ శక్తి ఇయక్కం' అనే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.

రజనీకాంత్ మద్దతు అన్నామలైకి లభిస్తుందా?

రజనీకాంత్ మద్దతు అన్నామలైకి లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్ష మద్దతు లేకపోయినా, కనీసం మౌన సమ్మతి కూడా అన్నామలైకి బలాన్నిస్తుందని అంచనా.

అన్నామలై ఢిల్లీ పర్యటన ఉద్దేశ్యం ఏమిటి?

అన్నామలై ఢిల్లీ పర్యటన బీజేపీ నాయకత్వాన్ని కలవడానికి, పార్టీలో తన భవిష్యత్తుపై స్పష్టత కోరడానికి వెళ్లి ఉండవచ్చు. కొంతమంది విశ్లేషకులు ఇది వీడ్కోలు భేటీ కావచ్చని కూడా భావిస్తున్నారు.

విజయ్, అన్నామలై మధ్య పోటీ ఎలా ఉండబోతోంది?

విజయ్, అన్నామలై ఇద్దరూ యువతను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉన్నారు. వారి మధ్య పోటీ తమిళనాడులో కొత్త తరం రాజకీయాలకు నాంది కావచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget