అన్వేషించండి

Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

Background

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి సమావేశం కావడంతో రెగ్యులర్‌ స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఎన్నికల సభ్యుల్లో ఆయన సీనియర్ కావడంతో ఈ బాధ్యతలు అప్పగించారు. నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఆయనతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హాజరు అయ్యారు. 

11 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అక్కడ అక్బరుద్దీన్‌ మిగతా ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. 11 గంటలకు సమావేశమయ్యే సభలో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. 

ఎమ్మెల్యేల ప్రమాణ తర్వాత శనివారం సాయంత్రం స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం స్పీకర్ ఎన్నికల ఉంటుంది. ఇప్పటికే స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రేవంత్ రెడ్డి సర్కారు ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నికల లాంఛనం కానుంది. 

బీజేపీ ఎమ్మెల్యే దూరం
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎంపిక చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం జరిగే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. గతంలో కూదా రాజా సింగ్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. 2018లో ప్రొటెం స్పీకర్‌గా అప్పటి సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ను నియమించారు. దీంతో రాజా సింగ్‌ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. తర్వాత ఆయనతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
కేసీఆర్‌ దూరం
తుంటి ఎముకకు గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ సమావేశాలకు దూరంగా ఉండబోతున్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలోని బాత్‌రూంలో జారి పడ్డారు. దీని కారణంగా తుంటి ఎముక విరిగింది. దీనికి శుక్రవారం రాత్రి చికిత్స చేశారు. దీంతో ఆయన సభకు హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది. 

మొదటి రోజు ఎమ్మెల్యే ప్రమాణం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మూడో రోజు గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. నాల్గో రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ ఉంటుంది. నాలుగు రోజుల సమావేశాలు కారణంగా శాసన సభ చుట్టూ భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచే ఆంక్షలు మొదలయ్యాయి. 

అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ఎమ్మెల్యేలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందజేసిన సర్టిఫికేట్‌ ఒరిజినల్‌, రెండు జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది. వాటిని శాసనసభ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వారి లైఫ్‌పార్టనర్‌కు చెందిన నాలుగు ఫొటోలు తీసుకురావాలి. వారి బయోడేటాను కూడా ఇవ్వాలి. వారికి ఎమ్మెల్యే విధివిధానాలు తెలిపే హ్యాండ్‌బుక్ ఇస్తారు. 

22:32 PM (IST)  •  09 Dec 2023

యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

చిన్నజీయర్ స్వామి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ కు వెళ్లారు. తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. కేటీఆర్ ను, వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్యం వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


22:29 PM (IST)  •  09 Dec 2023

హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

శనివారం మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం కొన్ని అనివార్య కారణాల రీత్యా హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని నేరుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు.

22:29 PM (IST)  •  09 Dec 2023

హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

శనివారం మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం కొన్ని అనివార్య కారణాల రీత్యా హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని నేరుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు.

11:14 AM (IST)  •  09 Dec 2023

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నారు.  

11:12 AM (IST)  •  09 Dec 2023

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణలో మూడోసారి కొలువు దీరిన ప్రభుత్వ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ సమావేశాలు ప్రారంభించారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget