Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
LIVE

Background
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన తెలంగాణ గవర్నర్
తెలంగాణలో మరో వివాదం తెరపైకి వచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలగా ఎంపిక చేసే జాబితాను తమిళిసై తిరస్కిరించారు. ఈ కోటా కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి గవర్నర్ వద్దకు ప్రభుత్వ లిస్ట్ పంపించింది. దాన్ని ఇన్ని రోజులు ఆమోదించకుండా ఉంచిన గవర్నర్ ఇవాళ తిరస్కరిస్తూ సమాచారం పంపించారు.
అక్టోబర్ 1 నుంచి పవన్ నాల్గో విడత వారహి యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 1 నుంచి నాల్గో విడత యాత్రను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభించనున్నారు. ఈసారి యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా సాగనుంది. ఈ మేరకు జనసేన రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది.
గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం ట్యాంక్ బండ్‌లో వద్దని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చెరువుల్లోనే ఈ విగ్రహాలను నిమజ్జనం చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకూ సూచనలు చేసింది. అనంతరం నిమజ్జనంపై సమగ్రనివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకీ ఇవ్వాలని సిఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు వినాలని సీఐడీ విజప్తి చేసింది. అయితే బెయిల్ పిటిషన్‌పై ముందు వాదనలు వినాలని చంద్రబాబు తరఫున లాయర్లు కోర్టును విజప్తి చేశారు. మెమో ఫైల్ చేయాలని సీఐడీకి జడ్జి ఆదేశించారు.
అన్నవరం దేవస్థానంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు
కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానానికి నారా భువనేశ్వరి, వారి కుటుంబ సభ్యులు చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. దేవస్థాన సిబ్బంది ఆలయ మర్యాదలతో వారికి దర్శనం కల్పించారు. దర్శనానంతరం స్వామివారి వేద పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. ఉమ్మడి తూర్పుగోదావరి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ అన్నవరం దేవస్థానానికి చేరుకుని భువనేశ్వరికి తమ సంఘీభావం తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

