అన్వేషించండి

Breaking News Live Telugu Updates: పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో  పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Background

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. సంపర్క్​ సే సంవర్ధన్​లో భాగంగా బ్యాండ్మిటన్​ క్రీడాకారిణి పీవీ సింధులో అమిత్ షా, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. పీవీ సింధుతో భేటీ అనంతరం అమిత్ షా స్పందించారు. సింధు అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేసిందన్నారు. ఆట పట్ల ఆమె నిబద్ధత, చేసిన కృషి, అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ ట్వీట్ చేశారు.

అంతకుముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతం పలికారు.  ఈ ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి అమిత్ షా దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌, ఈటల తదితర నాయకులతో అమిత్ షా సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

మరోవైపు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పాటించాలని కేసీఆర్‌ చెప్పడం.. హాస్యాస్పదమని కిషన్‌ రెడ్డి విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని బీజేపీ సభగా హైదరాబాద్‌ పోలీసులు సర్కులర్‌ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్క్యులర్‌ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలని కిషన్​రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయ్. ఎన్నికలకు మరో రెండు నెలలే సమయం మాత్రమే ఉండటంతో... రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సెప్టెంబరు 17 లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్బీజేపీ, ఎంఐఎం అన్ని ప్రధాన పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, జాతీయ జెండాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేయబోతున్నాయి. తెలంగాణలో ఏటా సెప్టెంబర్‌ 17పై వివాదం సాధారణంగా మారుతోంది. గతేడాది మునుగోడు ఉపఎన్నికల తరుణంలో సెప్టెంబర్ 17పై విస్తృత చర్చ జరిగింది. స్వయంగా కేంద్రం రంగంలోకి దిగి విమోచన దినోత్సవం జరుపుతోంది. కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా జాతీయ సమైక్యత దినం జరుపుతోంది. నిజానికి తెలంగాణ ఏర్పాటైన దగ్గర్నుంచీ సెప్టెంబర్‌ 17ను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో జరుపుతూ వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహించలేదు. ఏటా సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా.. విలీనమా, విమోచనా.. విద్రోహమా అనే చర్చ జరుగుతూనే ఉంది. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా జరుపుతున్నట్టు స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 17కు స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1948లో ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది. ఆపరేషన్ పోలోలో భాగంగా సైనిక చర్యతో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను గద్దె దించి, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజుని కొందరు విమోచనం అంటారు. మరికొందరు విలీనం అంటున్నారు. ఇంకొందరు విద్రోహం అని పిలుస్తున్నారు

 

10:32 AM (IST)  •  17 Sep 2023

సేవాదివాస్‌గా మోదీ పుట్టిన రోజు : అమిత్‌షా

తెలంగాణ చరిత్రను 75 ఏళ్లపాటు వక్రీకరించారు: అమిత్‌షా
మోదీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటులను సరిచేస్తున్నారు: అమిత్‌షా
9ఏళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. : అమిత్‌షా
మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ సేవాదివాస్‌గా జరుపుకుంటున్నాం: అమిత్‌షా

10:26 AM (IST)  •  17 Sep 2023

సర్దార్‌పటేల్‌ లేకుంటే తెలంగాణ విముక్తి సాధ్యమయ్యేది కాదు : అమిత్‌షా

సర్దార్‌పటేల్‌ లేకుంటే తెలంగాణ విముక్తి సాధ్యమయ్యేది కాదు : అమిత్‌షా
పటేల్‌, కేఎం మున్షీ వల్లే నిజాం పాలన అంతం : అమిత్‌షా

10:24 AM (IST)  •  17 Sep 2023

హైదరాబాద్‌కు ఇవాళ విముక్తి లభించింది: అమిత్‌షా

రజాకార్లపై పోరాడిన వీరులకు నివాళి: అమిత్‌షా
తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు: అమిత్‌షా
హైదరాబాద్‌కు ఇవాళ విముక్తి లభించింది: అమిత్‌షా

10:22 AM (IST)  •  17 Sep 2023

సెప్టెంబర్‌ 17న వేడుకలు జరపకుండా చరిత్రను తొక్కిపెట్టారు: కిషన్ రెడ్డి


దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు స్వాతంత్య్రం రావడానికి లక్షల మంది పోరాటం చేశారన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వేల మంది బలయ్యారు. భారత సైన్యం కూడా నిజాం సైన్యంతో పోరాటం చేసి ఓడించి మూడు రంగుల జెండా ఎగరేశారు. నిజాం సర్కారు రైతులు, ప్రజలపై అకృత్యాలు చేశారు. నగ్నంగా బతుకమ్మ ఆడించారు. అనేక రకాలుగా దోపిడీ చేశారు. అందుకే ప్రతీ గ్రామంలో ప్రజలు తెగించి పోరాడారు. ఇన్నేళ్లు ఈ చరిత్రను తొక్కిపెట్టారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన వారు సెప్టెంబర్‌ 17 ను తెలియకుండా చేశారు. ఇదే రోజు అప్పటలో వల్లభాయ్‌ పటేల్‌ తిరంగా పతాకాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు అమిత్‌షా ఆ పని చేస్తున్నారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. త్యాగాలను దాచిపెట్టారు. 75 ఏళ్లుగా హైదరాబాద్‌ లిబరేషన్‌ను వేడుకలు జరపకుండా నిర్లక్ష్యం చేశారు. 
ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు పాలకులు అంటున్నట్టు ఇది సమైక్య దినం ఎలా అవుతుంది. పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణ సమైక్యత దినం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 

09:31 AM (IST)  •  17 Sep 2023

తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమిత్‌షా

పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న హైదరాబాద్‌ విమోచన దిన వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరులకు అమిత్‌ షా నివాళులు అర్పించారు. పారామిలటరీ బలగాల గౌరవవందనం స్వీకరించారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
Embed widget