Breaking News Live Telugu Updates: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
LIVE

Background
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో పెట్టుకున్న పిటిషన్ తిరస్కరించడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణ 19కి వాయిదా వేసింది.
తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో బస్ బోల్తా- అనకాపల్లి జిల్లా వాసులకు గాయాలు
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కొత్త పోలవరం గ్రామానికి చెందిన యాత్రికు వెళ్తున్న బస్ ప్రమాదానికి గురైంది. తిరుపతి వెళ్తుండగా నాయుడుపేట సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రయాణ సమయంలో బస్‌లో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. 20 మందిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. వారిలో ఏడాది పాపకు చేతులు విరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు గూడూరు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

