Top Headlines Today: ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ? 'ప్రజాపాలన'పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Telangana Latest News 24 December 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Andhra Pradesh Telangana News Today: 'ప్రజాపాలన'పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం - ఈ నెల 28 నుంచి నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆదివారం సెక్రటేరియట్ లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ 'ప్రజాపాలన' (Prajapalana) కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల తడక, అబద్ధాల పుట్ట: కేటీఆర్, స్వేదపత్రం విడుదల
ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల తడక అని, అది అబద్ధాల పుట్ట అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కోట్లమంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ప్రస్తుతం 'స్వేద పత్రం' విడుదల చేస్తున్నామని కేటీఆర్ ఆన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ‘స్వేదపత్రం’ పేరిట తెలంగాణ భవన్ లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎంత మంది పీకేలను పెట్టుకున్నా జగన్‌ను ఏం పీకలేరు - కొడాలి నాని సెటైర్లు
చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంత మంది పీకేలను పెట్టుకున్నా.. సీఎం జగన్ ను పీకేదెం ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని.. సీఎం జగన్, తాము రోజూ చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే భూమి బద్దలై పోతుందా అని మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ ను తాము పూర్తిగా వాడేశామని, ఇక ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఐప్యాక్ - ప్రశాంత్ కిషోర్ వేర్వేరా ? ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ?
ఐ ప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా అమరావతికి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఓ సంచలనంగా మారింది. దీనికి కారణం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో ఎప్పుడూ అసోసియేట్ కాలేదు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి పని చేసేందుకు పీకే ఆసక్తి చూపినా.. .చంద్రబాబు అంగీకరించలేదని చెబుతారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత పీకే విషయంలో చంద్రబాబు చాలా విమర్శలు చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్, జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
విద్యార్థినులకు స్కూటీల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు, విధివిధానాల రూపకల్పనలో అధికారులు
తెలంగాణ (Telangana)లో కొలువు దీరిన కాంగ్రెస్ (Congress)పార్టీ హామీల అమలుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం... మిగిలిన వాటిని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme)కింద ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఆరోగ్య శ్రీ వైద్య ఖర్చుల పరిమితిని పెంచింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విద్యార్థినుల ఓట్లను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి