అన్వేషించండి

పురావస్తు తవ్వకాల్లో విష్ణుమూర్తి విగ్రహం, అచ్చం అయోధ్య బాల రాముడిలాగే ఉందే!

Ayodhya Ram Lalla Idol: రాయ్‌చూర్‌లో కృష్ణా నదీ తీరాన బయటపడిన విష్ణుమూర్తి విగ్రహం అచ్చం అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని పోలి ఉంది.

Ram Lalla Idol: అచ్చం అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని పోలిన విగ్రహాన్ని కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో కనుగొన్నారు. మొత్తం దశావతారాలతో కూడిన విష్ణుమూర్తి విగ్రహం దాదాపు అయోధ్య రాముడినే పోలి ఉండడం ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు ఓ శివలింగమూ బయటపడింది. రాయ్‌చూర్‌లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇవి వెలుగులోకి వచ్చాయి. ఈ రెండూ 11 లేదా 12వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు పురావస్తు శాఖ అధికారులు. విష్ణుమూర్తి విగ్రహాన్ని కృష్ణా నదీ తీరంలో కనుగొన్నారు. అక్కడే శివలింగమూ బయట పడింది. స్థానికుల్లోనూ ఈ ఘటన ఆసక్తి కలిగించింది. 

"బహుశా ఈ శివలింగం, విష్ణుమూర్తి విగ్రహం 11 లేదా 12వ శతాబ్దానికి చెందినవై ఉండాలి. ఈ రెండు విగ్రహాలూ ఆయా ఆలయాల్లోని గర్భగుడుల్లో ఉండి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నాం. ఇక్కడి ఆలయం నీటిలో మునిగిపోయి ఉండొచ్చు"

- పురావస్తుశాఖ అధికారులు

Image

శంఖుచక్రాలతో ఉన్న విష్ణుమూర్తి విగ్రహంపై దశావతారాలు చెక్కి ఉన్నాయి. వేదాల్లో వేంకటేశ్వరస్వామిని వర్ణించినట్టుగానే ఈ విష్ణుమూర్తి విగ్రహం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే...ఇక్కడ గరుడ విగ్రహం మాత్రం కనిపించలేదని తెలిపారు. 

యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అయోధ్య రాముడి విగ్రహాన్ని (Ayodhya Ram Lalla Idol) చెక్కిన అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రతిష్ఠించిన సమయంలో చూస్తే అసలు ఆ విగ్రహాన్ని చెక్కింది తానేనా అని ఆశ్చర్యపోయానని చెప్పాడు. అలంకరణ తరవాత అంత ఆ రామయ్య విగ్రహానికి అంత అందం వస్తుందని ఊహించలేదని అన్నాడు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరవాత ఏదో తెలియని అందం అందులోకి వచ్చి చేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

"ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరవాత బాల రాముడి విగ్రహం రూపు రేఖలే మారిపోయాయి. అసలు తయారు చేసింది నేనేనా అని నాకే అనుమానం వచ్చింది. అలంకరణ తరవాత రామయ్య స్వరూపమే మారిపోయింది. చెక్కుతున్న సమయంలోనే ఒక్కో దశలో ఒక్కో విధంగా కనిపించింది. కానీ ఆభరణాలతో అలంకరించిన తరవాతే మొత్తం రూపురేఖలు మారిపోయాయి"

- అరుణ్ యోగిరాజ్, రామ్‌లల్లా విగ్రహ శిల్పి 

టాప్ హెడ్ లైన్స్

ISRO Scientists Resign:ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
Corona Cases Increase: మళ్లీ కోవిడ్ గుబులు - కర్ణాటక, ఏపీల్లో పెరుగుతున్న కేసులు.. దేశవ్యాప్తంగా హై అలర్ట్!
మళ్లీ కోవిడ్ గుబులు - కర్ణాటక, ఏపీల్లో పెరుగుతున్న కేసులు.. దేశవ్యాప్తంగా హై అలర్ట్!
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget