Anant Ambani Wedding: రాధికను హగ్ చేసుకున్న అనంత్ అంబానీ, ఎమోషనల్ అయిన ముకేశ్ - వీడియో
Anant Ambani Radhika Merchant Wedding: పూజా కార్యక్రమం పూర్తైన తరవాత అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ని హగ్ చేసుకున్నాడు. ఇది చూసిన ముకేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు.

Anant Ambani Radhika Merchant Wedding Updates: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి అతిథులంతా క్యూ కడుతున్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పెళ్లి వేదికకు చేరుకుంటున్నారు. గెస్ట్‌ల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది అంబానీ కుటుంబం. ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వివాహం జరుగుతోంది. అయితే...ఇవాళ కూడా ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పలు పూజా కార్యక్రమాలూ నిర్వహించారు. ఘర్ శాంతి పూజా చేసిన అంబానీ కుటుంబం ఈ సందర్భంగా చాలా ఆనందంగా కనిపించారు. వధువు, వరులైన రాధికా మర్చంట్, అనంత్ అంబానీ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. దండలు మార్చుకున్నారు. ఆ తరవాత ప్రేమగా ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఇది చూసిన వెంటనే ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియోలో రాధికా మర్చంట్ వైట్ అండ్ గోల్డ్ శారీలో మెరిసిపోయారు. అనంత్ అంబానీ మెరూన్ కుర్తా, గోల్డ్ నెహ్రూ జాకెట్‌తో కనిపించారు.
View this post on Instagram
మార్చి నెల నుంచే ప్రీవెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. మొట్టమొదట గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసింది అంబానీ కుటుంబం. ఈ వేడుకల్లో పాప్ ఐకాన్ రియానా ప్రదర్శన ఇచ్చింది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ ఈ స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్‌లు చేశారు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, కరణ్ జోహార్‌తో పాటు అనిల్ కపూర్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆ తరవాత ఇటలీలో క్రూజ్‌లో ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. మొత్తం మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి.
Also Read: Anant Ambani Wedding: ఏంటి, కొడుకు పెళ్లి కోసం ముకేశ్ చేస్తున్న ఖర్చు అంతేనా - చాలా ఆశ్చర్యంగా ఉందే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

