Anankapalli Crime : కాబోయే భర్త గొంతు కోసిన యువతి, కళ్లు మూసుకుంటే సర్ ప్రైజ్ ఇస్తానని దాడి
Anankapalli Crime : అనకాపల్లిలో దారుణ ఘటన జరిగింది. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇస్తానని కాబోయే భర్తను పిలిచి కళ్లు మూసుకోమని చెప్పి కత్తితో దాడి చేసింది.
Anankapalli Crime : అనకాపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్తపై దాడి యువతి దాడిచేసింది. కాబోయే భర్తను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని పిలిచి దాడి చేసింది. కళ్లు మూసుకుంటే మంచి బహుమతి ఇస్తానని చెప్పి తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. తనకు పెళ్లి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా అతడితో పెళ్లి చేస్తున్నారని యువతి ఆ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. యువకుడు హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ లో పరిశోధకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
అనకాపల్లి బుచ్చయ్యపేట మండలం కొమళ్లపూడి వద్ద కాబోయే భర్తపై యువతి హత్యాయత్నం చేసింది. వచ్చే నెలలో వీరి వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో యువతి ఈ దాడికి పాల్పడింది. షాపింగ్ కు వెళ్దామని చెప్పి మార్గమధ్యలో సరదాగా అని చెప్పి యువకుడి కళ్లకు గంతలు కట్టి కత్తితో దాడి చేసింది. కొమళ్లపూడి ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడు రామానాయుడుని స్థానికులు అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, యువతి కోసం గాలిస్తున్నారు.
Also Read : Gang Rape on Wife: ఇంటి ఓనర్లని పిలిచి భార్యపై గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, అతని కళ్లెదుటే పాశవికం!
తల్లిదండ్రులు వినిపించుకోలేదని దాడి
వచ్చే నెల 29న పాడేరుకు చెందిన రామునాయుడు రావికమతం మండలానికి చెందిన పుష్పతో వివాహం చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. ఇద్దరికి నిశ్చితార్థం కూడా చేశారు. యువకుడు హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ లో పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవలె హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చాడు. మాట్లాడాలని తీసుకెళ్లిన యువతి ఒక సర్ప్రైజ్ ఇస్తానని కళ్లు మూసుకోవాలని చెప్పి తన వద్ద ఉన్న చాకుతో గొంతు కోసింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఈ పని చేసినట్లు యువతి తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోలేదని అందుకే ఈ పని చేసినట్లు యువతి అంటోంది.
Also Read : Suryapet Crime : క్రూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి, మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం
Also Read : Hyderabad Drugs Case : పుడింగ్ పబ్‌లో డ్రగ్స్ అమ్మతున్నట్లు ఆధారాల్లేవు - కోర్టులో పోలీసుల కస్టడీ రిపోర్ట్ !