Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
Andhra Pradesh: పెట్టుబడులు ఏపీకి వచ్చే అంశంలో నారా లోకేష్, వ్యాపారవేత్త మోహన్ దాస్ పాయ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. లోకేష్ ఆహ్వానంపై వ్యాపారవేత్త ఏపీలో ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ జరగాల్సి ఉందన్నారు.
investments In AP : సాఫ్ట్‌వేర్ రంగానికి కీలకంగా ఉన్న బెంగళూరులో మౌలికసదుపాయాల కొరతపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు , ఐటీ ఉద్యోగులకు చిరాకెత్తించేలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడానికి గంటల సమయం పడుతుంది.ఇక వర్షం వస్తే చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం బెంగళూరు వర్షాల ధాటికి కకావికలం అయిపోయింది. ఈ సందర్భంలో పరిస్థితుల్ని మెరుగుపర్చాలని లేకపోతే ఎమ్మెన్సీలు తమ కార్యాలయాలను ఇక్కడి నుంచి తరలించేస్తాయని ప్రముఖ పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు మోహన్ దాస్ పాయ్ ట్వీట్ చేశారు.
Lack of action by @CMofKarnataka @siddaramaiah @DKShivakumar @PriyankKharge on roads, drainage, traffic on ORR is leading to huge anger and is forcing many MNC’s to seriously consider expanding outside City.promises made by CM, DCM repeatedly not upheld,trust down. This is very…
— Mohandas Pai (@TVMohandasPai) October 21, 2024
మంత్రి నారా లోకేష్ ఈ ట్వీట్‌పై స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే వారి కోసం ప్రత్యేకంగా ఆరు పాలసీలు సిద్ధం చేశారని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీకి వచ్చేయాలని పిలుపునిచ్చారు.
Namaskaram @TVMohandasPai Sir. With humble regards, I would like to extend an invitation to all MNCs to Andhra Pradesh, where Hon'ble Chief Minister Shri @ncbn Garu has introduced new, business-friendly policies. We view industries as vital stakeholders in our state’s welfare and… https://t.co/roCd8AG3Cu
— Lokesh Nara (@naralokesh) October 24, 2024
దీనికి మోహన్ దాస్ పాయ్ భిన్ంగా స్పందించారు. గత ప్రభుత్వం వల్ల ఏపీ అంటే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు పరిస్థితుల్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నా ఇంకా ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉందన్నారు.
Thanks @naralokesh Trust levels in Andhra is low after what Jagan https://t.co/uJ67rOBHDW has to start visibly in Amravati to give hope.human capital is low in Andhra, people from outside will not easily relocate there.connectivity needs to be improved.Too early,pl show progress https://t.co/oWvnzKf3qS
— Mohandas Pai (@TVMohandasPai) October 24, 2024
గతంలో ఓ పారిశ్రామిక ఇలానే ట్వీట్ పెడితే..అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ ఏపీకి రావాలని పిలుపునిచ్చారు. అప్పటి కర్ణాటక ప్రభుత్వంలోని మంత్రులు కేటీఆర్‌కు కౌంటర్ ఇవ్వడంతో అది రాజకీయ ఇష్యూ అయింది.
Sadly the last govt ruined the future of Andhra and damaged its future. Babu Garu has much to do to restore trust,need more action on ground first. https://t.co/oWvnzKf3qS
— Mohandas Pai (@TVMohandasPai) October 24, 2024