Amazon Layoffs: అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్‌లు, ఆ ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్
Amazon Layoffs: అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో మరోసారి లేఆఫ్‌లు ప్రకటించే అవకాశాలున్నాయి.
![Amazon Layoffs: అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్‌లు, ఆ ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్ Amazon Layoffs AWS To Cut Hundreds Of Jobs In Sales Marketing Teams Amazon Layoffs: అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్‌లు, ఆ ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/995b9b45c76cccc94fed735436a0777d1712210979985517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amazon Web Services Layoffs: ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీలన్నీ లేఆఫ్‌లు విడతల వారీగా కొనసాగుతూనే ఉన్నాయి. వీలైనంత వరకూ వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. అమెజాన్‌లో ఇప్పటికే పలు విడతల్లో ఉద్యోగులను తొలగించగా...ఇప్పుడు మరోసారి ఎంప్లాయిస్‌కి షాక్ ఇవ్వనుంది. Amazon Web Services (AWS) లో వర్క్‌ఫోర్స్‌ని తగ్గించనుంది. ఈ కారణంగా వందలాది మంది ప్రభావం పడే అవకాశముంది. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం...అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లోని సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ మెంబర్స్‌ని తొలగించనున్నారు. brick-and-mortar stores కి సంబంధించిన డెవలపింగ్ టీమ్‌లోని సభ్యులనూ ఇంటికి పంపేందుకు అంతా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు అమెజాన్ కంపెనీ ప్రతినిధి ఒకరు ఈ విషయం వెల్లడించారు. సంస్థలో కొన్ని కీలక విభాగాలపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. అందులో వర్క్‌ఫోర్స్ ఎంత అవసరమో అంత వరకే ఉండేలా లేఆఫ్‌లు చేపడుతున్నట్టు వివరించారు. చాలా మందిపై ఈ ప్రభావం పడే అవకాశముందని స్పష్టం చేశారు. అంటే...ఈ సారి లేఆఫ్‌లు గట్టిగానే ఉంటాయని తేల్చి చెప్పారు.
అయితే...ఇలా ఉద్యోగాల నుంచి తొలగించిన వాళ్లను వేరే రోల్స్‌కి షిఫ్ట్ అయ్యేందుకు సహకరిస్తామని కంపెనీ వెల్లడించింది. గతేడాది AWS సేల్స్ గ్రోత్ బాగా పడిపోయింది. కంపెనీ వీటిపై పెట్టిన ఖర్చుని తగ్గించడంతో పాటు టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేయండపైనా పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ సమస్య వచ్చి పడినట్టు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. గతేడాది కూడా AWSలో లేఆఫ్‌లు జరిగాయి. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అప్పుడే కంపెనీ ప్రకటించింది. దాదాపు 27 వేల మందిని తొలగించింది. గత కొద్ది నెలలుగా మళ్లీ ఈ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. అయితే...ఈ లేఆఫ్‌ల కారణంగా కీలక ప్రాజెక్ట్‌లపై ఎఫెక్ట్ పడుతోంది. Alexa assistantతో పాటు Prime Video,Music Division, హెల్త్‌కేర్ ప్రాజెక్ట్‌లపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)