అన్వేషించండి

Tirupati Laddu Controversy : రివర్స్ టెండర్లలో అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ - అల్ఫా కంపెనీ చుట్టూనే అసలు వివాదం

Tirumala : టీటీడీకి అత్యధికంగా నెయ్యి సరఫరా చేసిన అల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ చుట్టూ వివాదం చోటు చేసుకుంటోంది. విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకుని కల్తీ నెయ్యిని పంపిందని టీడీపీ ఆరోపిస్తోంది.

Alpha Milk Products Laddu Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి వివాదంలో ఎక్కువగా అల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ పేరు ప్రచారంలోకి వస్తోంది. ఈ కంపెనీ అత్యధికంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. టెండర్లు వేసి.. రివర్స్ టెండర్లు వేసి .. అతి తక్కువ ధరలకు కాంట్రాక్టులను  నిరాటంకంగా  దక్కించుకుంది. గత మూడేళ్లుగా టీటీడీకి అత్యధికంగా ఈ కంపెనీ నెయ్యి సరఫరా చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కంపెనీపైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. 

అల్ఫా కంపెనీపై టీడీపీ నేతల ఆరోపణలు    

అల్ఫా కంపెనీ బటర్ ఆయిల్ ను విదేశాల నుంచి  దిగుమతి చేసుకుని నెయ్యిగా మార్చి.. టీటీడీకి సరఫరా చేసిందని తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు , టీడీపీ నేత ఓవీ రమణ ఆరోపణలు  చేశారు. ఈ సంస్థకు టీటీడీకి  నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం లేదని అతి తక్కువ ధరకు టెండర్లు తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని అంటున్నారు.  సామర్థ్యం లేని  కంపెనీకి.. నెయ్యిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చి ఇస్తారో చూసుకోకుండా కాంట్రాక్ట్ ఇచ్చారని అంటున్నారు.
Tirupati Laddu Controversy : రివర్స్ టెండర్లలో అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ - అల్ఫా కంపెనీ చుట్టూనే అసలు వివాదం

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారు! టీటీడీ ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు

రివర్స్ టెండర్లలో భారీగా కాంట్రాక్టులు దక్కించుకున్న అల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్

వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు, రివరస్ టెండర్ల విధానాన్ని టీటీడీలోనూ అమలు చేశారు. ఈ కారణంగా ఏళ్ల తరబడి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి తక్కువ ధరకు ఇవ్వలేమని స్పష్టం  చేసింది. కొన్నిసార్లు టెండర్లలో పాల్గొనలేదు. పాల్గొన్నా.. అతి తక్కువ ధరకు ఇవ్వడానికి సిద్ధపడలేదు. అయితే అల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ మాత్రం టెండర్లకు  .. రివర్స్ టెండర్లకు తగ్గించుకుంటూ వెళ్లి కాంట్రాక్టులు పొందింది.
Tirupati Laddu Controversy : రివర్స్ టెండర్లలో అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ - అల్ఫా కంపెనీ చుట్టూనే అసలు వివాదం

వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?

రూ. 610కి టెండర్ -రివర్స్ టెండర్‌లో రూ. 424 కే !

అల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్   అతి తక్కువకు టెండర్లు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున తగ్గింపులు ఇచ్చింది. టెండర్లలో ఒక రేటు వేస్తే.. రివర్స్ టెండర్లలో మరింత తక్కువకు కోట్ చేసి టెండర్లను దక్కించుకుంది. గత ఏప్రిల్‌లో జరిగిన టెండర్లలో కేజీ రూ. 610 కి దాఖలు చేసింది. కానీ రివర్స్ టెండర్లలో మాత్రం రూ. 424కి మాత్రమే సరఫరా చేస్తామని అంగీకరించింది. ఒక్క కేజీకే రూ. 190కిపైగా తగ్గింపు ఇచ్చి టెండర్లు దక్కించుకుంది. 2022లోనూ ఇలా రివర్స్ టెండర్లలో ఇలా అల్ఫా కంపెనీ టెండర్లు దక్కించుకుంది. టెండర్లలో రూ. 414 కు కోట్ చేసి.. రివర్స్ టెండర్లలో రూ. 337 కు  కోట్ చేసి టెండర్లు పొందింది.    

ఇలా వైసీపీ అధికారలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండర్ల ద్వారా అల్ఫా కంపెనీ ఎక్కువ కాంట్రాక్టు పొందింది. ఈ కంపెనీ చుట్టూనే  వివాదం నెలకొంది.   టీడీపీ నేతలు  అల్ఫా కంపెనీ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Embed widget