(Source: ECI/ABP News/ABP Majha)
Allu Arjun Fans: తగ్గేది లేదంటూ ఓ యూట్యూబ్ చానల్ ఆఫీసుపై దాడి - అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహం !
Attack: తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అల్లు అర్జున్ అభిమానులు ఓ యూట్యూబ్ చానల్ ఆఫీసుపై దాడి చేశారు. దాంతో ఆ చానల్ అభిమానులకు సారీ చెప్పిది.
Allu Arjun fans attacked the office of a YouTube channel alleging false propaganda: సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోను దూషిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హైదరాబాద్‌లోని ఓ యూట్యూబ్ చానల్ పై దాడికి దిగారు. కొంత కాలంగా పవన్ కల్యాణ్‌కు.. అల్లు అర్జున్ కు సరిపడటం లేదని ప్రచారం జరుగుతోంది. నంద్యాల ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పటి నుండి ఈ గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని యూట్యూబ్ మీడియా చానళ్లు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఓ చానల్ ఇదే అంశంపై వరుసగా వీడియోలు చేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ కు ఆరోగ్యం బాగోలేదని ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని ఓ స్టోరీ రాసేశారు. దాంతో ఫ్యాన్స్‌కు మండిపోయిది. నేరుగా యూట్యూబ్ చానల్ ఆఫీసుకు వెళ్లి రచ్చ చేశారు. కంప్యూటర్లు, సామాగ్రిని ధ్వంసం చేశారు.
చానల్ యాజమాన్యం కాసేపటికి దిగి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా ఆ థంబ్ నెయిల్స్ పెట్టలేదని అల్లు అర్జున్ ను కించ పరచలేదని.. అలా చేసిన వీడియోలన్నింటిని తీసేస్తామని హామీ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ శాంతించారు. దీనిపై ఇంకా ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. పోలీసు కేసులు నమోదయినట్లుగా సమాచారం కూడా లేదు.
రెడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆఫీసు మీద దాడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్
— @వావిలాల రాజశేఖర శర్మ (@VRajeshekar) November 11, 2024
కంప్యూటర్లు, సామగ్రి ధ్వంసం
అల్లు అర్జున్ మీద ఉద్దేశపూర్వకంగా నీచమైన ఫోటోలతో వీడియోలు చేస్తూ 'చావు,బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న అల్లు అర్జున్' అంటూ వీడియోలు పెట్టడం పై ఆగ్రహం pic.twitter.com/NbiVqMCQpJ
ఆదివారం విశాఖలో జరిగిన మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వరుణ్ తేజ్ మాట్లాడిన మాటల్ని కూడా అల్లు అర్జున్ కు అన్వయించి ప్రచారం చేశారు. ఆ వీడియోలను కూడా వైరల్ చేసుకున్నారు.తమ స్వార్థం కోసం మెగా కుటుంబం మధ్య చిచ్చు పెడుతున్నారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా వారు దాడి చేసిన యూట్యూబ్ చానల్ పూర్తిగా అదే పని మీద ఉంటోందని.. ఫ్యాన్స్ ను రెచ్చొగట్టి వ్యూస్ పెంచుకుంటోందని అందుకే దాడులకు దిగారని తెలుస్తోంది.
మొత్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలజడి.. కాసేపు హంగామా సృష్టించింది. అక్కడ ఎలాంటి దాడులు జరగలేదని.. కేవలం తప్పుడు ప్రచారంపై వివరణలు మాత్రమే అడిగారని.. తప్పుడు కథనాలను యూట్యూబ్ నుంచి తీసేస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు.