![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Viral News: దెయ్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు, కోర్టులో విచారణ - తరవాతే అసలు ట్విస్ట్
Allahabad High Court: అలహాబాద్ హైకోర్టులో ఓ వింత కేసు విచారణ జరిగింది. చనిపోయిన వ్యక్తి ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా పోలీసులు FIR నమోదు చేశారు.
![Viral News: దెయ్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు, కోర్టులో విచారణ - తరవాతే అసలు ట్విస్ట్ Allahabad High Court Quashes FIR Lodged By A Ghost Slams Investigating Officer Viral News: దెయ్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు, కోర్టులో విచారణ - తరవాతే అసలు ట్విస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/2cbbc11ea5bd1b20731b0908fdd7939d1723205635401517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Viral News in Telugu: అలహాబాద్ హైకోర్టులో ఓ వింత కేసు విచారణకు వచ్చింది. 2014లో చనిపోయిన ఓ వ్యక్తి చీటింగ్ కేసు పెట్టినట్టుగా ఓ FIR నమోదైంది. అది కూడా ఆ వ్యక్తి చనిపోయిన తరవాత మూడేళ్లకి రిజిస్టర్ అయింది. ఈ కేసుని జస్టిస్ సౌరభ్ శ్యామ్ శంషేరి ధర్మాసనం విచారించింది. ఈ సమయంలోనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తి స్టేట్‌మెంట్ ఇవ్వడమే విడ్డూరం అంటే...పోలీసులు ఈ కేసుని విచారించడం ఇంకా విడ్డూరం అని మండి పడ్డారు. అంతే కాదు. దీనికి Ghost Case అనే పేరు కూడా పెట్టారు. ఇన్వెస్టిగేటింగ్ అధికారినీ మందలించింది కోర్టు. చనిపోయిన వ్యక్తి స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు చెప్పడమే కాకుండా...ఆ పేరు మీద ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారని, ఇదంతా ఏంటని ప్రశ్నించింది. (Also Read: Viral News: అమ్మాయిల వివాహ వయసు 9 ఏళ్లకు కుదింపు, వివాదాస్పద బిల్లు తీసుకొస్తున్న ఇరాక్)
"ఇదంతా మాకు చాలా వింతగా అనిపిస్తోంది. చనిపోయిన వ్యక్తి కేసు పెట్టడమే కాకుండా తన స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడా..? అది కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ముందే వాంగ్మూలం ఇచ్చాడా..? ఈ కేసులో ప్రొసీడింగ్స్ అన్నీ దెయ్యమే వచ్చి చేసినట్టుంది. మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఈ కేసుని ఎలా విచారించారు"
- అలహాబాద్ హైకోర్టు
కేసు వివరాలివీ..
ఇది ఓ భూ వివాదం కేసు. ప్రయాగరాజ్ కు చెందిన శబ్ద్ ప్రకాష్ అనే వ్యక్తి తనపై దాడి చేశారని...పురుషోత్తం సింగ్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు FIR నమోదు చేశారు. అంతేకాదు.. ఆ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. అలా పురుషోత్తం సింగ్ అండ్ ఇంకా నలుగురిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఐతే.. ఇందులో తమ తప్పు లేదని.. ఇది తప్పుడు కేసు అని ఈ కేసును కొట్టివేయాలని పురుషోత్తం సింగ్‌తో పాటు మిగతా నలుగురు అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. FIR నమోదైన 10 ఏళ్ల తరువాత ఇది హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ సంచలన నిజం తెలిసింది. 2011లోనే ప్రకాష్ చనిపోయాడని ఆధారాలు కోర్టు ముందుకు వచ్చాయి. 2011లోనే ప్రకాష్ చనిపోతే..2014లో కంప్లైంట్ ఇచ్చింది ఎవరు దెయ్యమా..? అని కోర్టు మండి పడింది. ఆ దెయ్యం ఇచ్చిన స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డు చేశారు. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. దెయ్యం తరపున లాయర్ వకాల్తా కూడా పుచ్చుకున్నాడు. దీనిపైనే కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్పష్టం చేసింది. తప్పుడు పత్రాలతో కేసు నమోదు చేసిన పోలీసులు..వకాల్తా పుచ్చుకున్న లాయర్ పై చర్యలు తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
Also Read: Viral News: కర్ణాటక నవ దంపతుల మృతి కేసులో ట్విస్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్‌లతో సంచలనం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)